Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..

ఇద్దరు వ్యక్తుల్ని జంటగా చేసే వివాహం ఎన్నో నమ్మకాలు..సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. అదే నమ్మకం ఆ దేశంలో ఓ నెలలో అస్సలు పెళ్లిళ్లే జరగకుండా చేస్తోంది. ఆ నెల ఏ నెల? అంటే..

that month.. you will get divorced : వివాహం. రెండు జీవితాలను కలిపే అపురూపమైన వేడుక. పెళ్లి అంటే ఎన్నో నమ్మకాలు.ఆచారాలు.మరెన్నో రకాల సంప్రదాయలు. మంచి ముహూర్తంలో జంటగా మారాలి. దాని కోసం ఎన్నో సంప్రదాయలను పాటిస్తుంటారు. ఈ సంప్రదాయాలు ఆయా ప్రాంతాల్లో ఆయా పద్ధతుల ప్రకారం జరుగుతుంటాయి. అటువంటి ఓ వింత ఆచారం గురించి చెప్పుకుందాం. సంప్రదాయాలన్నీ నమ్మకాలమీదే ఆధారపడి జరుగుతుంటాయనే విషయం తెలిసిందే. అటువంటి ఓ నమ్మకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం.

Read more : వింత బోనాలు : ఐదేళ్లకోసారి ఊరంతా బంధనం..పూజలు పూర్తయ్యే వరకు గ్రామస్థులు పాచి ముఖం కడగరు, చీపురు పట్టరు

దక్షిణాఫ్రికాలో ఉన్న దేశం జింబాబ్వే. ఇక్కడి ప్రజలు నవంబర్ లో పెళ్లంటే హడలిపోతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్ లో పెళ్లిళ్లు చేసుకోరు. దానికి వారికున్న వింత నమ్మకమే కారణం. నవంబర్‌లో పెళ్లి చేసుకుంటే ఆ జంట కొంతకాలానికే విడిపోతారని నమ్ముతారు జింబాబ్వే ప్రజలు. ఒకవేళ ఆ జంట కలిసి ఉన్నా..వారికి పిల్లలు పుట్టరట. అని నమ్ముతారు అందుకే వారు నవంబర్ నెలలో పెళ్లిళ్లు చేసుకోరు.

Read more : Girl Marriage With God : ‘అనంత వింత ఆచారం’ : చిన్నారికి దేవుడితో పెళ్లి..

ఇటువంటి వింత నమ్మకం కలిగిన షోనా కమ్యూనిటీ ప్రజలు దక్షిణ ఆఫ్రికాలో ఉంటారు.ముఖ్యంగా జింబాబ్వేలో ఎక్కువగా ఉంటారు. నవంబరు నెలలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. వృక్షజాలం, జంతుజాలం… ఈ ​​రెండింటి అభివృద్ధికి ఈ నెల చాలా కీలకం. దీనికి ఆటంకం కలిగించేలా వేడుకలు చేయకూడదని ఇక్కడ ప్రజలు నిర్ణయించుకుని ఆ ఆచారాన్ని పాటిస్తుంటారు.పశు సమృద్దికి, వృక్ష సంపదకు ఆటంకం కలిగించేలా నవంబరు నెలలో వివాహాలు గానీ..మరి ఏ ఇతర వేడుకలు చేయరు. అలా చేస్తే కీడు జరుగుతుందని నమ్ముతుంటారు. దీంతో షోనా కమ్యూనిటీ ప్రజలు నవంబరులో వివాహాలు, వేడుకలు అస్సలు చేసుకోరు.

Read more : Strange Womens : దేవేంద్రుడుకి ధమ్కీ ఇవ్వటానికి ఆయుధాలతో వెళుతున్న మహిళలు

కానీ ఈ నమ్మకాన్ని కొంతమంది వ్యతిరేకిస్తుంటారు. కానీ చాలామంది మాత్రం పాటిస్తుంటారు. దీనిపై ఓ వ్యక్తి మాట్లాడుతు..ఎంతోమంది వద్దని చెబుతున్నా వినకుండా నా సోదరుడికి 8 సంవత్సరాల క్రితం నవంబర్ నెలలోనే వివాహం చేసాను.కానీ అతనికి ఇప్పటికీ పిల్లలు పుట్టలేదని తెలిపాడు.దీని గురించి ఇప్పటికీ తనను నిందిస్తుంటారని వాపోయాడు. సంప్రదాయాలను కొట్టి పారేయకూడదు. అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసి చేసినందుకు నా సోదరుడికి పిల్లలు పుట్టలేదని ఆ బాధ నన్ను ఎప్పటికీ తీరదని వాపోయాడు.

ట్రెండింగ్ వార్తలు