Kerala : రూ.250 పెట్టి లాటరీ టిక్కెట్‌‌ హరిత కర్మసేన మహిళలను వరించిన జాక్‌పాట్ .. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన శ్రామిక మహిళలు

వారి కష్టం గట్టెక్కింది. రెక్కాడితేనే గానా డొక్కాడని నిరుపేద మహిళలను లాటరీ టికెట్ రూపంలో అదృష్టం వరించింది. ధైర్య లక్ష్మిని నమ్ముకుని రూ.25లుఅప్పుచేసి మరీ లాటరీ టికెట్ కొన్న శ్రామిక మహిళ అదృష్టం ఫలించింది. రూ.10కోట్ల లాటరీ గెలుచుకున్నారు.

11 kerala Womens Rs.10 Crore Lottery Won : రోజు కష్టపడాలి. కష్టపడందే పూట గడవని మహిళలు..ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి చేతిలో కేవలం 25 రూపాయలు కూడాలేని నిరుపేద మహిళలు వారు. వారి కష్టాలను చూసి లక్ష్మీదేవి కరుణించిందేమో..లాటరీ రూపంలో కరుణించింది. రూ.250లు లాటరీ టికెట్ కొనటానికి 11మంది మహిళలు చందాలు వేసుకున్నారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అదృష్టం వరించింది. ఒకటీ రెండు కాదు ఏకంగా రూ.10కోట్ల జాక్ పాట్ తగిలింది. అంతే ఆ 11మంది మహిళలు కోటీశ్వరులైపోయారు.

కేరళ (Kerala) పరప్పనన్‌గడీ మున్సిపాలిటీకి (parappangadi Municipality) చెందిన హరిత కర్మ సేన (haritha karma sena (HKS)కు చెందిన ఈ మహిళలను రూ.10కోట్ల లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఈ కర్మసేన్ కు చెందిన మహిళలంతా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారంగా జీవిస్తున్నారు. వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయం అది మాత్రమే. అలా వారంతా కలిసి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకున్నారు. దాని కోసం గ్రూపులో ఉన్న కొంతమంది మహిళలు చందాలు వేసుకుని రూ.250లు జమ చేసి వాటితో లాటరీ టికెట్ కొన్నారు.

Amazon Store in Dal Lake : శ్రీనగర్ దాల్ సరస్సులో అమెజాన్ స్టోర్ .. మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్‌ ప్రారంభం

వారిలో కొంతమందికి రూ.25లు కూడా చేతిలో లేకపోవటం వారు టికెట్ కొనే దాంట్లో పాల్గొనలేకపోయారు. కానీ 11మంది మాత్రం వస్తే వచ్చింది పోతే పోయింది ఏదోకటి చేసిన లాటరీ టికెట్ కొనాలనుకున్నారు. అలా 11మంది చందాలు వేసుకుని కొన్నవారి అదృష్టం ఫలించింది.వీరిలో కొంతమంది అప్పుచేసి మరీ ఇచ్చారు.అలా వారు కొన్న టికెట్ కు రూ.10కోట్ల లాటరీ తగిలింది.

బుధవారం (జులై 26,2023) కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మాన‌సూన్ బంపర్ లాటరీ దక్కింది. ఆ నిరుపేద మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని సంబరపడిపోయారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

West Bengal : కన్నబిడ్డను అమ్మేసి ఐఫోన్ కొనుకున్న తల్లిదండ్రులు .. ఇన్‌స్టా రీల్స్ కోసమట

 

ట్రెండింగ్ వార్తలు