Amazon Store in Dal Lake : శ్రీనగర్ దాల్ సరస్సులో అమెజాన్ స్టోర్ .. మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్‌ ప్రారంభం

భారత్ లో అమెజాన్ మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్‌ ప్రారంభించింది. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అమెజాన్ స్టోర్ ను ప్రారంభించింది.

Amazon Store in Srinagar Dal Lake : శ్రీనగర్ లోని దాల్ లేక్ లో అమెజాన్ మొట్టమొదటి స్టోర్ ప్రారంభించింది. ‘ఐ హావ్ స్పేస్’లో భాగంగా కశ్మీర్ లోని శ్రీనగర్ లోని దాల్ సరస్సులో గురువారం (జులై 27,2023)న స్టోర్ ప్రారంభించింది. ఈ స్టోర్ తో తాము తమ డెలివరీ నెట్ వర్క్ ను మరింతగా విస్తరింజేస్తామని..అలాగే చిరు వ్యాపారులకు అదనపు ఆదాయాన్ని సంపాదించటానికి వీలు కల్పిస్తామని అమెజాన్ ఇండియా అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ స్టోర్ ప్రారంభంతో మొట్టమొదటి తేలియాడే అమెజాన్ స్టోర్ గా పేరొందింది.

హౌస్ బోట్ సెలెక్ టౌన్ యజమాని ముర్తాజా ఖాన్ మాట్లాడుతు..ఆన్ బోర్డింగ్ లో భాగంగా హౌస్ బోట్ ల డోర్ సటెప్ వద్ద కస్టమర్లకు ప్రతీరోజు ప్యాకేజీలను డెలివరీ చేస్తానని తెలిపారు. అమెజాన్ ఇండితో భాగస్వామ్యం అయినప్పటినుంచి తన అనుభవాన్ని గురించి ముర్తాజా చెబుతు నేను హౌస్ బోట్ ను పర్యాటకుల కోసమే కాకుండా నా వ్యాపారానికి కూడా వినియోగించుకుంటానని తెలిపారు. హౌస్ బోట్ నిర్వాహణ ఖర్చు చాలా ఎక్కవగా ఉంటుంది. ఇది మా కుటుంబానికి భారమేనని..పెరుగుతన్న ఖర్చుల కోసం నేను అదనపు ఆదాయం కోసం ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్న సమయంలో దాల్ లేక్ లో అమెజాన్ స్టోర్ ప్రారంభంతో నాకు ఈ అవకాశాన్ని నా ఆదాయాన్ని మెరుగు పరుచుకోవటానికి వీలు కలిగిందని తెలిపారు.

West Bengal : కన్నబిడ్డను అమ్మేసి ఐఫోన్ కొనుకున్న తల్లిదండ్రులు .. ఇన్‌స్టా రీల్స్ కోసమట
జూన్ లో మొదటి కార్యకలాపాలు ప్రారంభించినప్పటినుంచి దాత్ లేక్, నైజీర్ లేక్స్ తో పాటు చుట్టుపక్కల నివసించే వినియోగదారులకు డెలివరీలు చేస్తున్నానని తెలిపారు. ఇలాంటివారికి దాల్ లేక్ లో అమెజాన్ స్టోర్ ఆదాయ మార్గాన్ని చూపిస్తుందని ఇండియా అమెజాన్ పేర్కొంది.

అమెజాన్ లాజిస్టిక్స్, ఇండియా, డైరెక్టర్ కరుణ శంకర్ పాండే మాట్లాడుతూ ..ఇది శ్రీనగర్ అంతటా ఉన్న కస్టమర్‌లకు నమ్మదగిన డెలివరీలను అందిస్తుందని..చిన్న వ్యాపారాలకు అవకాశాలను మెరుగుపరుస్తుందని..అమెజాన్ డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుందని తెలిపారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో భారతదేశపు మొట్టమొదటి తేలియాడే ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్‌ను ప్రారంభించినందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. ఇది దాల్ లేక్, నిజీన్ సరస్సు అంతటా ఉన్న కస్టమర్‌లకు నమ్మకమైన, సమర్థవంతమైన, వేగవంతమైన డెలివరీలను అందించడానికి మాకు వీలు కల్పిస్తుందని పాండే తెలిపారు.

500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..

2015లో ప్రారంభించబడిన ‘ఐ హావ్ స్పేస్’ కార్యక్రమంలో భారతదేశంలోని దాదాపు 420 పట్టణాలు,నగరాల్లో 28,000 మంది భాగస్వాములు ఉన్నారు. ఇది 2 నుండి 4 కిలోమీటర్ల పరిధిలో ఉత్పత్తులను డెలివరీ చేయడానికి స్థానిక దుకాణాలు మరియు చిన్న వ్యాపారాలతో భాగస్వామ్యం కలిగి ఉంది.


										

ట్రెండింగ్ వార్తలు