West Bengal : కన్నబిడ్డను అమ్మేసి ఐఫోన్ కొనుకున్న తల్లిదండ్రులు .. ఇన్‌స్టా రీల్స్ కోసమట

ఐఫోన్ కోసం..సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసం కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు..

West Bengal Crime : వస్తువుల్ని వాడుకోవాలి..తోటి మనుషులపై ప్రేమ చూపించాలి. కానీ ప్రస్తుత కాలంలో మనుషుల్ని వాడుకుంటున్నారు వస్తువులపై ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అంతేకాదు వస్తువుల మోజుతో కన్నబిడ్డల్నే కూరగాల్లా అమ్మేస్తున్నారు. ఐఫోన్ కొనుక్కోవటానికి ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు. ఇన్ స్టాలో రీల్స్ కోసం కన్నబిడ్డను అంగడి సరుకులా అమ్మేసారు కన్నవారు. ఐఫోన్ కొనుగోలు చేయటానికి ఏకంగా కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సభ్యసమాజం సిగ్గుపడే ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. రీల్స్ చేసిన ఇన్ స్టాలో పోస్ట్ చేయటానికి ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నారు భార్యాభర్తలు. కానీ వారి వద్ద అంత డబ్బులేదు. దీంతో తమ ఎనిమిది నెలల పసిబిడ్డను అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నారు. వారింట్లో పసిబిడ్డ కనిపించకపోవటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Pune Horror Case: రూ.40వేల అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన షేక్

బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ నివసిస్తున్నారు. వారికి ఏడేళ్ల కూతురు, ఎనిమిది నెలల మగబిడ్డ ఉన్నారు. వీరికి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఉంది. ఇన్ స్టాలో రీల్స్ చేసిన పోస్ట్ చేయాలనుకున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారు. కానీ ఐఫోన్ ఉంటే ఇంకా బాగుంటుందిగా అనుకున్నారు. అంతే తమ ఎనిమిది నెలల మగపిల్లాడిని బేరం పెట్టారు.మంచి బేరం రావటంతో అమ్మేసారు. ఆనక చక్కగా ఆ డబ్బులు పట్టుకెళ్లి ఐఫోన్ కొనుక్కున్నారు.

కానీ ఇంట్లో ఉండే చంటిబిడ్డ కనిపించకపోవటంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించారు. దానికి వారు తమ బిడ్డను అమ్మేసి ఐఫోన్ కొన్నామని..ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నామని నిశ్చంకోచంగా చెప్పేశారు. కనీసం ఏదో అబద్దం ఆడటానికి కూడా యత్నించకుడా అంత నిర్భయంగా వారు చేసిన పని చెప్పటంతో స్థానికులు షాక్ అయ్యారు. అంతే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు దంపతులను ప్రశ్నించగా వారు స్థానికులకు చెప్పినమాటే పోలీసులకు కూడా చెప్పారు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. సిగ్గులేదా ఇలా చెప్పటానికి అంటే సిగ్గెందుకు..? అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను ఎవరికి అమ్మారు? ఎవరి ద్వారా అమ్మారు అని విచారిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు