Samantha : నటి సమంత హెల్త్ టిప్.. ఫైర్ అవుతున్న డాక్టర్స్.. నిరక్షరాస్యురాలు..
టాలీవుడ్ నటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 5, 2024 / 11:28 AM IST
Liver doc slams actor Samantha for spreading dangerous health misinformation
టాలీవుడ్ నటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ హెల్త్ టిప్ వైరల్‌గా మారింది. నెబులైబర్‌ను ధరించిన సమంత శ్వాసకోస వ్యాధుల ఇన్‌ఫెక్షన్ గురించి ఓ సలహ ఇచ్చింది. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నీటిలో కలుపుకుని పీల్చడం ద్వారా వైరల్ రుగ్మతలను దూరం చేస్తుందని ఆమె పోస్ట్ చేశారు.
సమంత చేసిన పోస్ట్ పై కాలేయ వ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఏబీ ఫిలిప్స్ స్పందించాడు. ఇంతకంటే బుద్ది తక్కువ పని మరొకటి ఉండదని అని ఆయన చెప్పారు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఆవిరిగా తీసుకోవద్దని, ఆస్థమా అలర్జీ పౌండేషన్ ఆఫ్ అమెరికా స్వయంగా తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై అలర్జీ పౌండేషన్ ఆఫ్ అమెరికా చెప్పిన సమాచారాన్ని షేర్ చేశారు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ ఓ కెమికల్.. ఇది నీరు, ఆక్సిజన్ గా మారుతుంది. అయితే.. ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్లా పని చేసి పని చేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి కానీ దారి తీస్తుందని చెప్పారు. సమంత ఒక హెల్త్ అండ్ సైన్స్ నిరక్షరాస్యురాలు అని అన్నారు. పలువురు డాక్టర్స్ సైతం సమంత పోస్ట్ పై మండిపడుతున్నారు.
