Bharateeyudu 2 Runtime : వామ్మో.. అన్ని గంట‌లు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో కూర్చుంటారా..? ‘భార‌తీయుడు 2’ ర‌న్‌టైం ఎంతంటే..?

లోకనాయ‌కుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భార‌తీయుడు 2).

Bharateeyudu 2 Runtime : వామ్మో.. అన్ని గంట‌లు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో కూర్చుంటారా..? ‘భార‌తీయుడు 2’ ర‌న్‌టైం ఎంతంటే..?

Kamal Haasan Bharateeyudu 2 censor and runtime details

Bharateeyudu 2 : లోకనాయ‌కుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భార‌తీయుడు 2). 1996లో ఘ‌న విజ‌యం సాధించిన ఇండియ‌న్ (భార‌తీయుడు) సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతుంది. తాజాగా ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు కొన్ని సూచ‌న‌లు చేస్తూ ‘U/A’ (యూ/ఏ) స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు కొన్ని ప‌దాల‌ను మ్యూట్ చేయాల‌ని మూవీ యూనిట్‌కు సూచించిన‌ట్లుగా సమాచారం.

ఇక ‘భార‌తీయుడు 2’ ర‌న్‌టైం ఏకంగా 3 గంట‌ల నాలుగు నిమిషాలు వ‌చ్చింది. అంత‌సేపు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టాల‌ని అంటే మాట‌లు కాదు. సినిమాలో ఆక‌ట్టుకునే క‌థ‌, క‌థ‌నాలు ఉండాల్సిందే. కాగా.. ర‌న్‌టైం విష‌యంలో శంక‌ర్ ఎలాంటి కాంప్ర‌మైజ్ కాలేద‌ట‌. క‌థ‌పై శంక‌ర్‌ పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ట‌. ఇటీవ‌ల ‘యానిమల్’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ లాంటి మూవీలు మూడు గంటల రన్ టైమ్‌తో వచ్చాయి. కంటెంట్ ఉంటే ఎంత‌సేపైనా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు కూర్చొంటారు అని ఈ సినిమాలు నిరూపించాయి.

Pawan Kalyan : ఆ రెండు సినిమాలు అంతేసంగతులా?

మ‌రీ ‘భార‌తీయుడు 2’ సినిమాను ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాల్సిందే. జూలై 12న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి. అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం ధీమాగా ఉంది.

సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, కాళిదాస్ జయరామ్, నెదురుమూడి వేణు, వివేక్, బ్రహ్మానందం తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై నిర్మాత సుభాస్క‌ర‌న్ ఈ మూవీ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

Vishwambhara Update : మెగాస్టార్ ‘విశ్వంభర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలు.. షూటింగ్ అయిపోయిందా?