అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.. ఎలాంటి కండిషన్లు పెట్టలేదు: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

కాంగ్రెస్‌లో నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందరికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి.

MLC Basavaraju Saraiah: కాంగ్రెస్‌లోకి తిరిగి రావడంతో స్వంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. పాత మిత్రుల ఆహ్వానం మేరకు సొంత గూటికి తిరిగొచ్చినట్టు చెప్పారు.

”కాంగ్రెస్ పార్టీలోనే నా రాజకీయ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ పార్టీలోనే ఎక్కువ కాలం ఉన్నాను. రాజకీయంగా నన్ను పైకి తెచ్చింది కాంగ్రెస్. నా స్వార్థం కోసం పార్టీ మారలేదు. కాంగ్రెస్‌లోకి రావాలని పాత మిత్రులు కోరారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచాను అనడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఓడిన తర్వాత కూడా పార్టీలోనే ఉన్నాను.. అప్పుడు కేసీఆర్ ఆహ్వానం పిలుపు మేరకే బీఆర్ఎస్‌లోకి వెళ్లాను.

బీఆర్ఎస్‌లోకి వెళ్ళాక వెంటనే నాకేం పదవులు రాలేదు. బీఆర్ఎస్‌లో కూడా కేసీఆర్ నాకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్‌లో నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందరికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి. ఎలాంటి కండిషన్లు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాన”ని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తెలిపారు.

Also Read : బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

మంత్రి పొంగులేటితో గద్వాల్ ఎమ్మెల్యే భేటీ
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా భేటీ నేపథ్యంలో ఆయన చేరిక లాంఛనమేనని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.

Also Read : కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి.. వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?

సరిత తిరుపతయ్యకు నచ్చజెప్పిన సీఎం
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్యతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. పార్టీలో సరితకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ సరిత అనుచరులు నిన్న గద్వాలలో నిరసనలు చేపట్టారు. ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి హంగామా చేయగా, పెట్రోల్ పోసుకుంటామని మరికొందరు హెచ్చరించారు. దీంతో సరితకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు.

ట్రెండింగ్ వార్తలు