సోనూసూద్‌కు కుమారి ఆంటీ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Sonu Sood : బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సంద‌ర్శించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నాడు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది. తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది.

Also Read : న‌టి స‌మంత హెల్త్ టిప్‌.. ఫైర్ అవుతున్న డాక్టర్స్.. నిరక్షరాస్యురాలు..

తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు సోనూసూద్‌. అదే స‌మ‌యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడుగ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గిలింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు.

మీరు ఎంతో మందికి సాయం చేశారు. మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read: Pawan Kalyan : ఆ రెండు సినిమాలు అంతేసంగతులా?

ట్రెండింగ్ వార్తలు