SSMB 29 : మొన్న ప్రభాస్‌తో.. ఇప్పుడు మహేష్ బాబుతో.. రాజమౌళి సినిమాలో ఆ మలయాళం స్టార్ హీరో నిజమేనా?

రాజమౌళి - మహేష్ బాబు నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు.

Prithviraj Sukumaran will Play Negative Role in Mahesh Babu Rajamouli Movie Rumours goes Viral

SSMB 29 : మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి అధికారికంగా ఏ ప్రకటన రాకపోయినా ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని, మహేష్ కూడా తన పాత్రకు తగ్గట్టు బాడీ బిల్డ్ చేస్తున్నట్టు పలువురు ఇప్పటివరకు ఇంటర్వ్యూలలో తెలిపారు.

అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో పేరు వినిపిస్తుంది. మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర పోషిస్తాడని వార్తలు వస్తున్నాయి. పృథ్విరాజ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ఇటీవల సలార్ సినిమాలో ప్రభాస్ తో నటించి ప్రేక్షకులకు మరింత పరిచయం అయ్యాడు.

Also Read : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త అవతారమెత్తనున్నాడా?

దీంతో పృథ్విరాజ్ సుకుమారన్ ఈసారి మహేష్ బాబుకి విలన్ గా నటించి మెప్పిస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక మహేష్ – రాజమౌళి సినిమా అడ్వెంచరస్ యాక్షన్ అని గతంలో రాజమౌళి తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ లో మొదలవచ్చు అని తెలుస్తుంది.