పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త అవతారమెత్తనున్నాడా?

Prabhas New Role: పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌కు సినిమాల్లో కథానాయకుడిగా చాలా భవిష్యత్‌ ఉంది. కానీ,

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త అవతారమెత్తనున్నాడా?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త అవతారమెత్తనున్నాడా? నిర్మాతల పాలిట దేవుడిగా భావించే బాహుబలి స్వయంగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నాడా? ఇన్నాళ్లు తన స్నేహితుడు విక్కీతో కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సినిమాలు నిర్మించిన ప్రభాస్‌… ఇక సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడా? వరుస సినిమాలతో… బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దుమ్మురేపుతున్న ప్రభాస్‌…. నిర్మాతగా ఎందుకు మారాలనుకుంటున్నట్లు?

డార్లింగ్‌ ప్రభాస్‌ నిర్మాతగా మారనున్నాడనే టాక్‌ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కల్కి సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌… త్వరలో సినీ నిర్మాణ రంగంలోనూ ప్రవేశించాలని చూస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్‌ భాగస్వామిగా యూవీ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌లో సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్‌ స్నేహితుడు విక్కీ ఈ బ్యానర్‌ను చూస్తున్నారు.

విక్కీ.. వీ మెగా పిక్చర్స్‌
ఐతే ఇప్పుడు విక్కీ.. వీ మెగా పిక్చర్స్‌ అనే కొత్త బ్యానర్‌ స్టార్ట్‌ చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్‌. ఈ కొత్త బ్యానర్‌లో రాంచరణ్‌ పార్టనర్‌గా ఉంటాడని చెబుతున్నారు. దీంతో ప్రభాస్‌ స్వయంగా ఓ బ్యానర్‌ను పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌కు సినిమాల్లో కథానాయకుడిగా చాలా భవిష్యత్‌ ఉంది. కానీ, నిర్మాతగానూ చిన్న, పెద్ద సినిమాలను నిర్మించాలనేది ప్రభాస్‌ ఇంట్రెస్టుగా చెబుతున్నారు. తన సినిమాలను సొంత బ్యానర్‌లో నిర్మించాలని ప్రభాస్‌ ప్లాన్‌గా చెబుతున్నారు.

ఇన్నాళ్లు ప్రభాస్‌ భాగస్వామిగా ఉన్న యూవీ క్రియేషన్స్‌ దాదాపు 11 సినిమాలు నిర్మించగా, ఐదు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు చూసింది. ప్రభాస్‌ నటించిన మిర్చి, రాధేశ్యామ్‌, సాహో చిత్రాలు కూడా యూవీ క్రియేషన్‌ బ్యానర్‌లోనే నిర్మించారు. ఇప్పుడు విక్కీ వేరుపడటంతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నాడు ప్రభాస్‌. ఐతే ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ, ప్రభాస్‌ను త్వరలో నిర్మాతగా చూడబోతున్నామనేది ఇండస్ట్రీ టాక్‌.

Samantha : ‘నువ్వు వారియర్‌వి.. నీ కోసం ప్రార్థిస్తుంటా..’ స‌మంత పోస్ట్ వైర‌ల్‌..