Pushpa 2 – HariHara Veeramallu : డిప్యూటీ సీఎం డేట్స్ ఇస్తే.. ‘పుష్ప 2’కు పోటీగా ‘హరిహర వీరమల్లు’..

హరిహర వీరమల్లు సినిమాకు పవన్ మూడు వారాల డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుంది.

Pushpa 2 – HariHara Veeramallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉండటంతో అయన సినిమాలు అటకెక్కాయి. మొన్నటివరకు ఖాళీ దొరికినప్పుడల్లా వారం రోజులు అయినా డేట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలకు డేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం తన చేతిలో ఉన్న మూడు సినిమాలు అయినా పూర్తిచేయాలని భావిస్తున్నారు.

పవన్ OG సినిమాకు ఇంకో రెండు వారాలు డేట్స్ ఇస్తే సినిమా పూర్తయిపోతుంది. హరిహర వీరమల్లు సినిమాకు మూడు వారాల డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. OG సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు. కానీ పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. హరిహర వీరమల్లు ముందే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. అమెజాన్ కి అక్టోబర్ లోపు సినిమా ఇస్తామని అగ్రిమెంట్ కూడా జరిగిందట. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే అమెజాన్ తో మాట్లాడి డిసెంబర్ వరకు టైం తీసుకొని షూట్ పూర్తి చేసి ఎలాగైనా హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

Also Read : Darshan : దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ చూశారా?

ఇటీవల హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే తెలిపారు. పవన్ మూడు వారాల డేట్స్ ఇస్తే డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఆగస్టు నుంచి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో పుష్ప 2 సినిమాకు హరిహర వీరమల్లు పోటీకి వస్తుందేమో, ఓ వారం రోజుల తర్వాత రిలీజ్ అవుతుందేమో అని టాలీవుడ్ లో వినిపిస్తుంది. పవన్ అభిమానులు మాత్రం ఎప్పుడొచ్చినా పర్లేదు సినిమాలు వస్తే చాలు అని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు