Site icon 10TV Telugu

Darshan : దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ చూశారా?

Kannada Film Industry Planning Movies on Darshan Issue some Titles Approached to Film Chamber

Kannada Film Industry Planning Movies on Darshan Issue some Titles Approached to Film Chamber

Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ కి మరో నటి ప్రవిత్రా గౌడతో సంబంధం ఉండగా పవిత్రని రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు.

ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో దర్శన్ ఈ హత్య చేయించాడు అనే చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దర్శన్ ని, అరెస్ట్ చేసిన వాళ్ళని విచారిస్తున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఈ హత్య కేసుపై దర్శన్ ని అందరూ విమర్శిస్తుంటే కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. దర్శన్ అలాంటివాడు కాదని పలువురు అభిమానులు, దర్శన్ సన్నిహితులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ కేసుపై సినిమాలు కూడా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏదైనా ఇష్యూలో ఉండి జైలుకి వెళ్తే వారి జీవిత చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పలువురు ఇలాంటివాటిపై సినిమాలు కూడా తీస్తారు. ఈ క్రమంలోనే దర్శన్ జీవితం, దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలయిన సంగతులు, ఇప్పటి హత్య కేసు కలిపి సినిమాలు తీయాలని కన్నడ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్ లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని కూడా పలువురు వచ్చారట.

Also Read : Kalki three Days Collections : క‌ల్కి మూవీ క‌లెక్ష‌న్ల సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే..?

కన్నడ సినీ పరిశ్రమ సమాచారం ప్రకారం D గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు కోరారట. మరి దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో చూడాలి.

Exit mobile version