TISS Termination Staff : టీఐఎస్ఎస్ నోటీసుల ఉపసంహరణ.. ఆ 115 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!

TISS Withdraws Termination : సర్క్యులర్‌ ప్రకారం.. మొత్తం 55 మంది అధ్యాపకులు, 60 మంది బోధనేతర సిబ్బందిని టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (TET) నిధుల ప్రోగ్రామ్‌ల కింద నియమించారు.

TISS Withdraws Termination : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) 55 మంది టీచింగ్, 60 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌ తొలగింపునకు సంబంధించి నోటీసులను ఉపసంహరించుకుంది. ఎప్పటిలాగే తమ విధుల్లో కొనసాగాలని ఉద్యోగులను కోరింది. సర్క్యులర్‌ ప్రకారం.. మొత్తం 55 మంది అధ్యాపకులు, 60 మంది బోధనేతర సిబ్బందిని టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (TET) నిధుల ప్రోగ్రామ్‌ల కింద నియమించారు. ఆ ఉద్యోగులంతా కచ్చితమైన ప్రోగ్రామ్ వ్యవధితో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉన్నారని టీఐఎస్ఎస్ తెలిపింది.

Read Also : అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గౌహతిలోని నాలుగు టీఐఎస్ఎస్ క్యాంపస్‌లలోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తో కొనసాగుతున్న చర్చలు ఈ సమస్యను పరిష్కరించడానికి వనరులను టీఐఎస్ఎస్‌కి అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చాయి. టెట్ ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాల కోసం నిధులు విడుదల చేసేందుకు టెట్ కట్టుబడి ఉందని సర్క్యులర్ పేర్కొంది.

సంబంధిత టెట్ ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి 28 జూన్ 2024 నాటి అడ్మిన్/5(1) టెట్-ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్/2024 నంబర్ లేఖను తక్షణమే ఉపసంహరించుకుంది. అనంతరం తొలగించిన ఉద్యోగులను తమ విధుల్లో కొనసాగించాల్సిందిగా అభ్యర్థించింది. ఇన్‌స్టిట్యూట్ ద్వారా టెట్ సపోర్టు గ్రాంట్ అందిన వెంటనే వేతనాలు విడుదల అవుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది.

గతంలో కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడంతో విద్యార్థి సంఘం, తోటి అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. పదేళ్లకు పైగా అనుభవం కలిగిన ఈ అధ్యాపకుల తొలగింపు రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP TET 2024 Notification : జూలై 1నే ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు