పేపర్ లీక్‌పై కొత్త చట్టం.. ఇకపై నేరానికి పాల్పడితే.. రూ. 1 కోటి జరిమానా.. 10 ఏళ్ల జైలు శిక్ష!

Anti Paper Leak Law : పేపర్ లీకేజీలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలతో పాటు భారీ జరిమానాలు విధించనుంది.

Anti Paper Leak Law : దేశంలో పేపర్ లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పబ్లిక్, పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ కావడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, చీటింగ్‌లను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్​ ఆఫ్​ అన్​ఫెయిర్​ మీన్స్​) చట్టం 2024ను ప్రవేశపెట్టింది. నీట్ (NEET), యూజీసీ-ఎన్ఈటీ (UGC-NET) పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజీలు, అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది.

ఈ మేరకు కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పేపర్​ లీక్​లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త పేపర్ లీకేజీ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి ప్రధాన సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలలో పేపర్ లీకేజీ వంటి నేరాలను నిరోధించడమే ఈ చట్టం లక్ష్యంగా పేర్కొంది.

కఠినమైన శిక్షలు : పరీక్షా పత్రాలను లీక్ చేయడం లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేసే వ్యక్తులకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష, నేరం తీవ్రత బట్టి ఐదేళ్ల వరకు శిక్షా కాలం పెరుగుతుంది. అలాగే, అక్రమార్కులకు రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు.

నాన్-బెయిలబుల్ నేరాలు : ఈ కొత్త చట్టం కింద నమోదైన అన్ని నేరాలకు గుర్తింపుతో పాటు నాన్-బెయిలబుల్‌గా పరిగణిస్తారు. అంటే.. అధికారులు నేరానికి పాల్పడిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. నేరానికి రుజువైతే వారు బెయిల్ పొందలేరు.

సర్వీస్ ప్రొవైడర్లు : నేర తీవ్రతపై అవగాహన కలిగి ఉండాలి. ఆ నేరాన్ని రిపోర్టు చేయడంలో విఫలమైన ఎగ్జామినేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీగా రూ. ఒక కోటి జరిమానా విధిస్తారు.

వ్యవస్థీకృత నేరాలే లక్ష్యంగా : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేవారిపై ఈ కొత్త చట్టం కఠినంగా వ్యవహరించనుంది. సర్వీస్ ప్రొవైడర్‌లలోని సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగా అలాంటి కార్యకలాపాలలో పాల్గొనడం లేదా సహకరించడం వంటివి పాల్పడితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష నుంచి 10 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. అలాగే రూ. 1 కోటి జరిమానా కూడా విధిస్తారు. వ్యవస్థీకృత పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌లో ప్రమేయం ఉన్న ఎగ్జామినేషన్ అధికారులు లేదా సర్వీస్ ప్రొవైడర్‌లకు కనిష్టంగా 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, అదే రూ. 1 కోటి జరిమానా ఉంటుంది.

అమాయకులకు రక్షణ చట్టం : ఈ కొత్త చట్టం అమాయకులను నేరారోపణల నుంచి రక్షిస్తుంది. తమకు తెలియకుండానే నేరం జరిగిందని నిరూపించగల వ్యక్తులకు ఇది రక్షణగా ఉంటుంది. ఆ నేరాన్ని తాము నిరోధించడానికి శాయశక్తులా ప్రయత్నించినట్టుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అనేవి విద్యావేత్తలు, వైద్య నిపుణులకు కీలకమైన పరీక్షలు. 24 లక్షల మంది అభ్యర్థులతో మే 5న నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంది.

Read Also : UPSC Topper Aditya Srivastava : ‘కష్టపడితే.. ఒకరోజు కలలు నిజమవుతాయి’.. యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ రియాక్షన్..!

ముఖ్యంగా బీహార్‌లో పేపర్ లీకేజీ జరిగిందనే అనుమానాల కారణంగా యూజీసీ-ఎన్ఈటీ పూర్తిగా రద్దు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో, అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల కారణంగా జాయింట్ (CSIR-UGC-NET) జూన్ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు (NTA) ప్రకటించింది. ఈ పరీక్ష జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌లు, సైన్స్ కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హతను నిర్ణయిస్తుంది.

Read Also : Apple Back to School Sale 2024 : భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ పెన్సిల్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు!

ట్రెండింగ్ వార్తలు