SCCL Recruitment: ఎస్‌సీసీఎల్‌లో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం.. ఒకే ఒక్క క్లిక్ తో ఇలా అప్లై చేసుకోండి

SCCL Recruitment: భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది.

SCCL Recruitment: ఎస్‌సీసీఎల్‌లో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం.. ఒకే ఒక్క క్లిక్ తో ఇలా అప్లై చేసుకోండి

SCCL has released notification for 33 Medical Consultant Jobs.

Updated On : August 13, 2025 / 7:11 PM IST

మెడికల్ బాక్గ్రౌండ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 33 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 25వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. కాబట్టి, అర్హత గల అధికారిక వెబ్ సైట్ http://www.scclmines.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు 30
  • జనరల్ మెడికల్ కన్సల్టెంట్ (డెంటల్) పోస్టులు 3

విద్యార్హతలు:
అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎబీబీఎస్‌, బీడీఎస్/ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఉద్యోగ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:
అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85,000 జీతం ఇస్తారు.