Lady Don Aruna: రెండో రోజు లేడీ డాన్ విచారణ.. పోలీసులకు ఇచ్చిన సమాచారం ఇదే..

తాను ఫోన్ లాక్ మర్చిపోయానని అరుణ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Lady Don Aruna: రెండో రోజు లేడీ డాన్ విచారణ.. పోలీసులకు ఇచ్చిన సమాచారం ఇదే..

Updated On : August 29, 2025 / 9:27 PM IST

Lady Don Aruna: లేడీ డాన్ అరుణ రెండో రోజు పోలీసు విచారణ ముగిసింది. ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, ఇద్దరు సీఐల సమక్షంలో విచారణ జరిగింది. రాజకీయ నాయకులు, అధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలపై పోలీసులు అరుణపై ప్రశ్నల వర్షం కురిపించారు.

పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు.. నాకు తెలీదు, సంబంధం లేదు, మర్చిపోయా అని అరుణ చెప్పినట్లు సమాచారం.

ఇక అరుణ మొబైల్ ఓపెన్ చేయమని పోలీసులు అడగ్గా.. తాను ఫోన్ లాక్ మర్చిపోయానని అరుణ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర? బయటపడిన సంచలన వీడియో ఇదే..

బిల్డర్ ను బెదిరించిన కేసులో అరుణ ఒంగోలులోని జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంది. మూడు రోజుల పోలీసు కస్టడీ నిమిత్తం నెల్లూరు జిల్లా కోవూరు తరలించారు.

అరుణపై అనేక అభియోగాలు ఉన్నాయి. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోవూరు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆమెను ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. అరుణ ప్రియుడు, కరడుగట్టిన నేరగాడు శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు కావడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.

రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు అరుణ.. హోం శాఖలో కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. టీడీపీ ఎమ్మెల్యేలే పెరోల్ కోసం లేఖలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

పోలీసు అధికారులనే ఒక ఆటాడించింది. IAS లను చెప్పు చేతల్లో పెట్టుకుంది. రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయింది. లేడీ డాన్‌ అరుణ ఎపిసోడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.