నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర? బయటపడిన సంచలన వీడియో ఇదే..
హత్య ప్లాను వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీశ్ ఉన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చర్చించారు.

Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ చర్చలు జరిపినట్లు వీడియోలో ఉంది.
చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. హత్య ప్లాను వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీశ్ ఉన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చర్చించారు.
హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తమని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య తరహాలో అంతమొందించాలని కుట్రపన్నారని ప్రచారం జరుగుతోంది.
అయిదురోజుల కిందట పోలీసులకి తెలిసినా స్పందించలేదని, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఓ టిక్కెట్టు ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు సమాచారం.