స్పీకర్ వర్సెస్ బీఆర్ఎస్.. పవర్‌ పాయింట్ ఫైట్..! కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టేందుకు సర్కార్ రెడీ

కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్‌ అటాక్‌ కు హరీష్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం తమకు టైమ్‌ ఇవ్వకుండా..వన్‌సైడ్‌గా సమావేశాలు నిర్వహించాలనుకుంటే బాయ్‌కాట్‌ చేసే యోచనలో కూడా ఉన్నారట.

స్పీకర్ వర్సెస్ బీఆర్ఎస్.. పవర్‌ పాయింట్ ఫైట్..! కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టేందుకు సర్కార్ రెడీ

Telangana Assembly Speaker gaddam prasad

Updated On : August 29, 2025 / 8:38 PM IST

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫుల్‌ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. గత సెషన్‌ తర్వాత పొలిటికల్‌గా స్టేట్‌లో ఎన్నో డెవలప్‌మెంట్స్‌ జరిగాయి. ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్ అందింది. 665 పేజీల రిపోర్ట్‌ సారాంశాన్ని 60 పేజీలు తయారు చేసి ఇప్పటికే బయటపెట్టింది సర్కార్. ఇప్పుడా నివేదికను సభలో చర్చకు పెట్టి బీఆర్ఎస్‌ను, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

అధికార పార్టీకి కౌంటర్‌ ఇచ్చేందుకు ఇటు అపోజిషన్‌ బీఆర్ఎస్‌ కూడా అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. కానీ సభలో మాట్లాడే సమయం ఇస్తారా.? మన వాదన పూర్తిగా వినిపించేందుకు అవకాశం ఉంటుందా.? లేదా.? అసలు సబ్జెక్ట్‌కు వచ్చే సరికి మైక్ కట్ చేస్తే ఎలా.? అనేదానిపై చర్చోపచర్చలు జరుపుతోందట బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ సర్కార్ ఫుల్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టాలని ఎప్పటినుండో బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.

దీంతో సభ ముందు ఫుల్‌ రిపోర్టును పెట్టి చర్చించేందుకు సర్కార్‌ రెడీ అవుతోంది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి ఇచ్చిన 665 పేజీల ఫుల్ రిపోర్ట్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చేరిందట.

దీంతో కమిషన్ రిపోర్ట్‌ను ఎవరు లీక్‌ చేశారో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారట సర్కార్‌ పెద్దలు. (Telangana Assembly)

చెప్పాలనుకున్న విషయాలను సభలో చెప్పనిస్తారా?

అయితే గత సెషన్లలో తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మైక్ కట్ చేశారని.. ఇప్పుడు కీలకమైన కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ సందర్బంగానైనా తాము చెప్పాలనుకున్న విషయాలను సభలో చెప్పనిస్తారా లేదా అన్నది బీఆర్ఎస్ ఆందోళనకు దారి తీస్తోందట. ఇప్పటికే స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..సభలో తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడంతో పాటు.. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు.

అయితే స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా..చర్చ జరిగే రోజు వరకు సీన్‌ మారిపోయే ఛాన్స్ లేకపోలేదన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలను చెప్పే అవకాశం ఇస్తారా లేదా అన్నదే బీఆర్ఎస్ సందేహంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పక్షం, ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పేసి.. తమకు మాత్రం పేరుకే మైక్ ఇచ్చి.

అసలు మ్యాటర్‌కు వచ్చే సరికి మైక్‌ కట్‌ చేస్తే ఎలా అనేది గులాబీ పార్టీ వాదన. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌పై బురదజల్లుతున్నారని..అసెంబ్లీలోనైనా తమ వాదన వినిపించే అవకాశం ఇస్తారా లేదా అన్న డౌట్స్‌ బీఆర్ఎస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో..? స్పీకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతిస్తారో లేదోనన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది.

Also Read: ఉత్తరాంధ్రపై కూటమి వ్యూహం అదేనా? సాగర తీరం నుంచి జనసేనాని ప్రత్యేక వ్యూహరచన

మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ కావొద్దని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం మీద వాస్తవాలు చెప్పాలని గులాబీబాస్ ప్రయత్నించినా..అధికార పక్షం ఆ అవకాశం ఇవ్వకపోగా..కేసీఆర్‌పై నోరు పారేసుకుని ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో సార్‌ సభకు రానవసరం లేదని..మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌ లు సరిపోతారని బిఆర్‌ ఎస్‌ నేతలు భావిస్తున్నారు.

కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్‌ అటాక్‌ కు హరీష్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం తమకు టైమ్‌ ఇవ్వకుండా..వన్‌సైడ్‌గా సమావేశాలు నిర్వహించాలనుకుంటే బాయ్‌కాట్‌ చేసే యోచనలో కూడా ఉన్నారట. అయితే కాళేశ్వరం విషయంలో రేవంత్ సర్కార్ ఎంత నెగెటివ్ ప్రాపగండ చేసినా..వాస్తవాలేంటో ప్రజలకు తెలుసని అంటోంది బీఆర్ఎస్.

కాళేశ్వరం కట్టకముందు ఉన్న పరిస్థితులు..ఇప్పుడు పంటల పండుతున్న తీరు అంతా ప్రజల ముందు ఉందని..సర్కార్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా తమకు జరిగే నష్టమేమి లేదంటున్నారు. సభలో మాట్లాడే అవకాశం ఇస్తే..అధికార పక్షానికి అక్కడే కౌంటర్ ఇస్తామని..వాస్తవాలేంటో..అందుకు తమ దగ్గరున్న ఆధారాలేంటో సభలోనే క్లియర్‌ కట్‌గా చెప్పేస్తామంటోంది బీఆర్ఎస్. ఈ సారి అసెంబ్లీ సెషన్‌ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.