ఉత్తరాంధ్రపై కూటమి వ్యూహం అదేనా? సాగర తీరం నుంచి జనసేనాని ప్రత్యేక వ్యూహరచన
కూటమిలో త్రిమూర్తులుగా చెప్పుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ముగ్గురూ ఒకే సమయంలో విశాఖలో ఉండడం మాత్రం పొలిటికల్‌గా సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది.

Pawan Kalyan
Uttarandhra: శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు..రీజన్ ఏదైనా కూటమి జెండా ఎగరాల్సిందే. మొన్నటి పట్టును కొనసాగించాల్సిందే. ఏజెన్సీ ఏరియాల్లో ఓటు బ్యాంకు చేజారకుండా పక్కా స్కెచ్ వేయాల్సిందే. ఇదే కూటమి ప్లాన్‌గా కనిపిస్తోంది.
మొన్నటివరకు రాయలసీమ మీద స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టి..జగన్ కంచుకోట కడప గడపలో మహానాడు నిర్వహించి.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్స్‌లో గెలిచి సత్తా చాటిన కూటమి..ఇప్పుడు ఓవర్ టు ఉత్తరాంధ్ర అంటోంది.
జగన్ వాడిన అస్త్రాన్ని అతనికే తిరిగి పంచ్ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తోంది. మూడు రాజధానుల్లో జగన్ విశాఖ చుట్టూ చర్చ జరిగేలా ప్లాన్ చేస్తే అదే వైజాగ్ కేంద్రంగా సరికొత్త గేమ్ షురూ చేసింది కూటమి. (Uttarandhra)
ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖను అన్ని విధాలుగా డెవలప్ చేయడంతో పాటు ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పైగా మాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీలు ఏవీ వచ్చిన ఓవర్ టు విశాఖ అంటోంది కూటమి సర్కార్.
సేమ్‌టైమ్ విశాఖ సాగర తీరంలో వైసీపీ హయాంలో కట్టిన రిషికొండ భవనాలపై కూడా చర్చ జరిగేలా చేస్తోంది. అందమైన, అద్భుతమైన కొండను తవ్వి, ప్రకృతిని నాశనం చేసి వందల కోట్లు వృథా చేసి భవనాలు కట్టారని..వైసీపీ ప్రజాధనం వృథా చేస్తే తాము ప్రతీరూపాయి పేదల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటోంది కూటమి.
ఇక రాజకీయంగా ఉత్తరాంధ్రకు చాలా ప్రయారిటీ ఇస్తున్నాయి కూటమి పార్టీలు. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉంటారు కాపు ఓటర్లు. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్..జనసేన చీఫ్‌గా, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
వైసీపీ వీక్‌గా ఉన్న చోట వ్యూహాలు
ఇప్పుడు అధికారంలో ఉండటంలో ఉత్తరాంధ్రలో వైసీపీ వీక్‌గా ఉన్న చోట తన బలాన్ని పెంచుకునే వ్యూహాలు రచిస్తున్నారు. సేమ్‌టైమ్ ఏజెన్సీ ఏరియా కావడంతో ఎస్టీ ఓట్లు ఎక్కువే. కొన్ని షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్న ఉత్తరాంధ్రలో ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు కూడా ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న కాపు..ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమ సాలిడ్ ఓటు బ్యాంకుగా చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కూటమి. అటు బీజేపీకి వైజాగ్ సిటీలో అంతో ఇంతో పట్టుంది. అది కూడా తమకు ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన పల్లా శ్రీనివాస్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
అదే ప్రాంతానికి చెందిన పీవీ మాధవ్..కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇలా కూటమిలో మూడు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో..విశాఖ ఇప్పుడు రాజకీయ రాజధానిగా మారిపోయింది. ఏపీ పాలిటిక్స్ మొత్తం విశాఖ చుట్టే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడ్రోజుల పాటు విశాఖలో పార్టీ సమావేశాలు పెట్టి..క్యాడర్, లీడర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాదు తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..కూటమిగా కలిసి ఉండటం ఎందుకు అవసరమే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. జనసేన కూటమిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సాగే పార్టీ సమావేశాలు కాబట్టి పూర్తిగా హైప్ క్రియేట్ అయింది. సాగర తీరంలో పొలిటికల్ హడావుడి కనిపిస్తోంది.
విశాఖలోనే బిజీగా
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖ టూర్ పెట్టుకున్నారు. నేషనల్ స్పోర్స్ట్ డే సందర్భంగా దాదాపుగా అయిదారు గంటల పాటు ఆయన విశాఖలోనే బిజీగా గడపనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను అడ్రస్ చేయనున్నారు.
బాబు పర్యటన పూర్తిగా అధికార స్థాయికి పరిమితం అవుతున్నా కూడా విశాఖలో ముఖ్యమంత్రి ఒక రోజు గడపడం అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కూడా ఉండటంతో కూటమి ప్రభుత్వమే విశాఖకు వచ్చినట్లు ఉందని అంటున్నారు.
ఇక కూటమి ప్రభుతంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ కూడా మూడు రోజుల విశాఖ పర్యటన పెట్టుకున్నారు. విశాఖ టీడీపీ ఆఫీసులో బస చేయడంతో పాటు..విశాఖలో పార్టీ పనితీరు అలాగే ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఆరా తీస్తారు.
కూటమిలో త్రిమూర్తులుగా చెప్పుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ముగ్గురూ ఒకే సమయంలో విశాఖలో ఉండడం మాత్రం పొలిటికల్‌గా సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది.
పవన్‌ది పార్టీ కార్యక్రమం అయినా..చంద్రబాబుది ప్రభుత్వ కార్యక్రమం, లోకేశ్‌ది పార్టీ యాక్టివిటీ కావడం చూస్తుంటే..ఈ టూర్ల షెడ్యూల్ అంతా ముందస్తు ప్లాన్ ప్రకారమేనన్న చర్చ జరుగుతోంది.