Job Mela: రేపే మెగా జాబ్ మేళా.. 17 కంపెనీలు, 1730 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం
విజయనగరం జిల్లా భీమసింగి శ్రీ బాలాజీ జూనియర్ & డిగ్రీ కళాశాలలో ఆగస్టు 29వ తేదీన మరో మెగా జాబ్ మేళా(Job Mela) జరగనుంది.

Mega job mela in Vizianagaram district with 1730 jobs
Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాల వారీలా ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి విజయనగరం జిల్లా భీమసింగి శ్రీ బాలాజీ జూనియర్ & డిగ్రీ కళాశాలలో ఆగస్టు 29వ తేదీ(రేపు)న మరో మెగా జాబ్ మేళా(Job Mela) జరగనుంది. మొత్తం 17 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని దాదాపు 1,730 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9000102013 సంప్రదించాలని అధికారులు సూచించారు.
GATE 2026 Registration: మొదలైన గేట్ 2026 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు
సంస్థ, ఖాళీల వివరాలు:
ప్రీమియర్ సోలార్ 60 ఖాళీలు
డిక్సన్ 210 ఖాళీలు
ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
ష్నైడర్ ఎలక్ట్రిక్ 120 ఖాళీలు
టాటా ఎలక్ట్రానిక్స్ 70 ఖాళీలు
ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 30 ఖాళీలు
నవతా ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 30 ఖాళీలు
అపోలో ఫార్మసీ 40 ఖాళీలు
జాబ్ డీలర్స్ 100 ఖాళీలు
డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 150 ఖాళీలు
ఔరోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 150 ఖాళీలు
యోకోహామా టైర్స్ అచ్చుతాపురం – విశాఖ ట్రేడర్స్, అగనంపూడి 100 ఖాళీలు
24Q 200 ఖాళీలు
కాన్సెంట్రిక్స్ డాక్ష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
WNS 90 ఖాళీలు
మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 80 ఖాళీలు