GATE 2026 Registration: మొదలైన గేట్ 2026 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026 Registration) కోసం దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు మొదలయ్యింది. ఆగస్టు

GATE 2026 registration process has begun.
GATE 2026 Registration: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026 Registration) కోసం దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు మొదలయ్యింది. ఆగస్టు 28, 2025 అనగా ఇవాళ్టి నుండే ఈ ప్రక్రియను అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు అధికారులు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తులు సమర్పించాలి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది.
Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 1250 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా.. అస్సలు మిస్ అవకండి
గేట్ 2026 ముఖ్యమైన తేదీలు:
- ఆగస్టు 28: దరఖాస్తు ప్రారంభం
- సెప్టెంబర్ 28: దరఖాస్తులకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)
- అక్టోబర్ 9: దరఖాస్తులకు చివరి తేదీ (ఆలస్య రుసుముతో)
- ఫిబ్రవరి 7, 8, 14, 15: పరీక్షలు నిర్వహిస్తారు
- మార్చి 19: గేట్ 2026 ఫలితాల ప్రకటన
విద్యార్హత:
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో మూడవ సంవత్సరం చదువుతూ/పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము:
మహిళలు, SC/ST, PwD అభ్యర్థులు సాధారణ గడువు వరకు రూ.1,000, ఆలస్య గడువుతో రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర అభ్యర్థులు: సాధారణ గడువు వరకు రూ.2,000, ఆలస్య గడువుతో రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.
అవసరమయ్యే ధ్రువపత్రాలు:
ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, స్కాన్ చేసిన సంతకం, చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST), PwD/UDID సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in లోకి వెళ్లాలి.
- అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
- అక్కడ వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- భవిష్యత్తు పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.