TG EDCET: టీజీ ఎడ్‌సెట్‌ అప్డేట్.. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

తెలంగాణాలో ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్(TG EDCET) కౌన్సెలింగ్ పూర్తవగా తాజాగా సెకండ్

TG EDCET: టీజీ ఎడ్‌సెట్‌ అప్డేట్.. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

TG EdSET Second Phase Counseling Schedule Released sn

Updated On : August 28, 2025 / 6:47 AM IST

TG EDCET: తెలంగాణాలో ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్(TG EDCET) కౌన్సెలింగ్ పూర్తవగా తాజాగా సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ను ప్రకటించారు అధికారులు. ఇందులో భాగంగా ఎంట్రెన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆగస్ట్ 29వ తేదీ నుంచి ఆన్లైన్లో https://edcetadm.tgche.ac.in/ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ కీలక అప్డేట్.. సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఇదే

టీజీ ఎడ్‌సెట్‌ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:

ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు రిజిస్ట్రేషన్లు

సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 6 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక

సెప్టెంబర్ 7 వెబ్ ఆప్షన్ల ఎడిట్

సెప్టెంబర్ 11 సీట్ల కేటాయింపు

సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 16 వరకు రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది.