AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ కీలక అప్డేట్.. సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఇదే

ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSC) సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియను మరోసారి వాయిదా

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ కీలక అప్డేట్.. సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఇదే

AP Mega DSC Certificate Verification Postponed Once Again

Updated On : August 27, 2025 / 10:25 AM IST

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. మారిన డేట్ ప్రకారం ఆగస్ట్ 28 గురువారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. నిజానికి, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌(AP Mega DSC) ప్రకారం ఆగస్టు 26 నుంచే ధ్రువపత్రాల పరిశీలన మొదలుకావాల్సి ఉంది. కానీ, రెండుసార్లు వాయిదా వేశారు.

LIC Recruitment: డిగ్రీ, బీటెక్ పాసైన వారికి ఎల్ఐసీలో జాబ్స్.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

మరోవైపు కాల్ లెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యాశాఖ. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా వారి వారి లాగిన్‌ వివరాలతో కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఆగస్ట్ 28 నుంచి ప్రారంభమయ్యే వెరిఫికేషన్ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసేలా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. సెప్టెంబర్ మొదటి వారంకల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి.. రెండో వారం నాటికి కొత్త టీచర్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు.