AP Mega DSC Certificate Verification Postponed Once Again
AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. మారిన డేట్ ప్రకారం ఆగస్ట్ 28 గురువారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. నిజానికి, ముందుగా ప్రకటించిన షెడ్యూల్(AP Mega DSC) ప్రకారం ఆగస్టు 26 నుంచే ధ్రువపత్రాల పరిశీలన మొదలుకావాల్సి ఉంది. కానీ, రెండుసార్లు వాయిదా వేశారు.
మరోవైపు కాల్ లెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యాశాఖ. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా వారి వారి లాగిన్ వివరాలతో కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆగస్ట్ 28 నుంచి ప్రారంభమయ్యే వెరిఫికేషన్ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసేలా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. సెప్టెంబర్ మొదటి వారంకల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి.. రెండో వారం నాటికి కొత్త టీచర్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు.