Redmi Note 15 Pro Plus: చైనాలో విడుదలైంది… భారత్‌లో లాంచ్‌కాగానే కొందామనుకుంటున్నారా? ఫీచర్లు అదరహో

ఇండియాలో రూ.32,990 ధరతో విడుదల కానుంది. ఇది ప్రీమియం మిడ్‌రేంజ్ మార్కెట్లోకి వస్తుంది.

Redmi Note 15 Pro Plus: చైనాలో విడుదలైంది… భారత్‌లో లాంచ్‌కాగానే కొందామనుకుంటున్నారా? ఫీచర్లు అదరహో

Xiaomi Redmi Note 15 Pro Plus

Updated On : August 29, 2025 / 9:41 PM IST

Xiaomi Redmi Note 15 Pro Plus: షావోమీ రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్ ఈ నెల 21న చైనాలో విడుదలైంది. భారత్‌లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. రెడ్‌ మీ నోట్ 15 సిరీస్ భారత్‌లో 2025 నాలుగో త్రైమాసికంలో లాంచ్‌ కావచ్చని తెలుస్తోంది. అధికారిక తేదీ ఇంకా నిర్ధారణ కాలేదు.

సన్నని డిజైన్, మంచి హార్డ్‌వేర్, అద్భుతమైన ఫీచర్లు ఇప్పటికే ఈ ఫోన్‌పై అంచనాలు పెంచేశాయి. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో, విశ్లేషకులు ఏం చెబుతున్నారో చూద్దాం.. (Xiaomi Redmi Note 15 Pro Plus)

ప్రాసెసర్

ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 ప్రాసెసర్ ఉంది. ఇది ఆక్టా-కోర్ 2.7 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్‌తో కలిపి పనిచేస్తుంది. 12 జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Also Read: అప్పులు, వడ్డీలపై కాగ్‌ రిపోర్ట్‌తో సరికొత్త చర్చ.. వచ్చిన ఆదాయం మిత్తీలకే స‌రిపోతుందంటున్న సర్కార్

డిస్‌ప్లే, బ్యాటరీ

ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల అమోల్డ్‌ స్క్రీన్ ఉంది. రిజల్యూషన్ 1220 x 2772 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 443 ppi. హెచ్‌డీఆర్‌10+, డాల్బీ విజన్ సపోర్ట్, 120 హెచ్‌జడ్‌ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

డ్యూరబిలిటీ కోసం షియోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ వాడారు. పంచ్ హోల్ డిజైన్ ఆధునికంగా కనిపిస్తుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా

బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ సెకండరీ కెమెరా, 8 ఎంపీ సెన్సార్ ఉన్నాయి. అన్ని కెమెరాల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది.

డివైస్ ధర

ఇండియాలో రూ.32,990 ధరతో విడుదల కానుంది. ఇది ప్రీమియం మిడ్‌రేంజ్ మార్కెట్లోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు. ప్రారంభ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ వచ్చే అవకాశం ఉంది.