SSC CGL Update: ఎస్‌ఎస్సీ సీజీఎల్‌ అప్డేట్.. సెప్టెంబర్ లోనే పరీక్షలు.. కొత్త షెడ్యూల్, పూర్తి వివరాలు

SSC CGL Update: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CGL) పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే.

SSC CGL Update: ఎస్‌ఎస్సీ సీజీఎల్‌ అప్డేట్.. సెప్టెంబర్ లోనే పరీక్షలు.. కొత్త షెడ్యూల్, పూర్తి వివరాలు

SSC CGL exams in the first week of September

Updated On : August 13, 2025 / 12:46 PM IST

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CGL) పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఈ ఆగస్టు 13న అంటే ఇవాళ జరగాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వేస్తూ ప్రకటన చేశారు అధికారులు. అలాగే, సెప్టెంబర్‌ మొదటి వారంలో పరీక్షలను నిర్వహిస్తామని, పూర్తిస్థాయి ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని కూడా కమిషన్‌ ప్రకటన చేసింది.

ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగానే టైర్‌-1 పరీక్షలు ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగాల్సింది. అయితే, సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. నేపథ్యంలోనే సీజీఎల్‌ పరీక్షలను వాయిదా వేసిన కమిషన్‌.. కొత్త పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది.