Telangana DSC 2024 : ఉపాధ్యాయ నియామక పరీక్షకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

DSC Exam Schedule Released : తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. మొత్తం 13రోజులు పరీక్షలు జరగనున్నాయి. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘీక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5వ తేదీన లాంగ్వేజ్ పండిట్ (హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. జూలై 21, 27,28, 29 తేదీలతోపాటు ఆగస్టు 3, 4 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

Also Read : Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జూలై 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. ఆన్ లైన్ పరీక్షలు కావడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం, ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్ లో పొందుపర్చారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ వ్యాప్తంగా 2.79,966 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, 220 ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉద్యోగాలు ఉన్నాయి.

Also Read : EPFO GIS : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది..!

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు..
జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష.
జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష.
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష.
జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు.
జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష.
జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష.
జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష.
జూలై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష.
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.
ఆగస్టు 5వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు