EPFO GIS : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది..!

EPFO GIS : సెప్టెంబర్ 2013 కన్నా ముందుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు మాత్రం ఎప్పటిలానే పాత నిబంధనలే వర్తించనున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్షన్ కానుంది.

EPFO GIS : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది..!

EPFO discontinues GIS, to refund past deductions ( Image Source : Google )

EPFO GIS : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ఓ.. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) నిలిపివేసింది. 2013 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల జీఐఎస్ కింద పలు డిడక్షన్లలను నిలిపివేయనున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈపీఎఫ్ఓ నిర్ణయంతో 2013 సెప్టెంబర్ ఒకటి తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది.

Read Also : ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

సెప్టెంబర్ 2013 కన్నా ముందుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు మాత్రం ఎప్పటిలానే పాత నిబంధనలే వర్తించనున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్షన్ కానుంది. ఆ నెల తర్వాత చేరిన ఉద్యోగులకు వారికి కేటయించిన కేటగిరిలో వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనాన్ని పొందనున్నారు.

అంతేకాదు.. 2013 సెప్టెంబర్ ఒకటి తరువాత నుంచి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులందరికి ఇప్పటివరకు డిడక్షన్ అయిన మొత్తం అమౌంట్ వారి బ్యాంకు అకౌంట్లలో రీఫండ్ కానుంది. ఇకపై ఈ ఉద్యోగులు జీఐఎస్ పరిధి నుంచి శాశ్వతంగా వర్తించదు. జీఐఎస్ కింద డిడక్షన్స్ నిలిపివేయడంతో ఆయా ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి.

జీఐఎస్ వచ్చింది ఎప్పుడంటే? :
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) జనవరి 1982లో అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు ప్రయోజనాలను అందిస్తుంది. అందులో వారి కుటుంబాలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాయం చేయడానికి బీమా కవరేజ్, పదవీ విరమణపై ఒకేసారి చెల్లింపు పొందవచ్చు.

Read Also : Tesla Car Share Directions : టెస్లా కారు యజమానులు ఫోన్ నుంచే నేరుగా డైరెక్షన్స్ షేర్ చేయొచ్చు.. ఇదేలా పని చేస్తుందో వీడియో షేర్ చేసిన ఎలన్ మస్క్..!