AP Summer Holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడంటే?

AP Summer Holidays : జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. తాజా మార్పుతో ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

AP Summer Holidays Extended ( Image Source : Google )

AP Summer Holidays : ఏపీ రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో వేసవి సెలవులను ఈ నెల 12 నుంచి పొడిగిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. తాజా మార్పుతో ఒక రోజు తర్వాత అంటే.. ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరో రోజు వేసవి సెలవుల గడువును పొడిగించింది.

Read Also : TSPSC Group 1 Prelims : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష

ట్రెండింగ్ వార్తలు