TSPSC Group 1 Prelims : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష

TSPSC Group 1 Prelims : త్వరలోనే గ్రూపు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని టీజీపీఎస్‌సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష జరుగనుంది.

TSPSC Group 1 Prelims : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష

TSPSC Group 1 2024_ Group-I Preliminary Exam ( Image Source : Google )

TSPSC Group 1 Prelims : తెలంగాణలో గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూపు-1 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించింది. ఈ ప్రిలిమ్స్ పరీక్షను 3 లక్షల 2వేల మంది అభ్యర్థులు రాశారు. మరికొంతమంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రిలిమ్స్ రాయలేకపోయారు. గ్రూపు పోస్టులకు 4 లక్షల 3 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సుమారుగా ఒక లక్ష వెయ్యి మంది గైర్హజరయ్యారు. ఒక్కో పోస్టుకు 536 మధ్య పోటీపడ్డారు.

ఈరోజు ఉదయం 10:30 గంటలకు మొదలైన గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్ష మధ్యాహ్నం 1:00 వరకు జరిగింది. గ్రూపు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు.

మొత్తంగా 897 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్‌సీ ఏర్పాటు చేసింది. త్వరలోనే గ్రూపు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని టీజీపీఎస్‌సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష జరుగనుంది. ఈసారి నెగెటివ్ మార్కులు లేకపోవడంతో మెయిన్స్ పరీక్ష అభ్యర్థులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?