TG ICET Results 2024 : తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఎంతో చెక్ చేసుకోండి!

Telangana ICET Results 2024 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల పొందేందుకు జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణలో ఐసెట్ 2024 ప్రవేశపరీక్షను నిర్వహించారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TG ICET Results 2024 : తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (TS ICET Results 2024) ఫలితాలను ప్రకటించింది. ఈరోజు (జూన్ 14) సాయంత్రం 4 గంటల తర్వాత ఉన్న‌త విద్యా మండ‌లి, ఐసెట్ కన్వీనర్ ఐసెటల్ ఫలితాలను వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు (icet.tsche.ac) అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల పొందేందుకు జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణలో ఐసెట్ 2024 ప్రవేశపరీక్షను నిర్వహించారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు అధికారిక ఆన్సర్ కీ జూన్ 8న విడుదల అయింది. ఈ అభ్యంతరాల విండో జూన్ 9న క్లోజ్ అయింది. సబ్జెక్ట్ నిపుణులచే ర్యాంకులను సమీక్షించిన తర్వాత అధికారిక ఫలితాలను రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఫైనల్ టీఎస్ ఐసెట్ 2024 ఆన్సర్ కీ విడుదల అయింది.

టీఎస్ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అభ్యర్థులకు వారి పేరు, రోల్ నంబర్, స్కోర్‌లు (సెక్షనల్) పరీక్షలో వారి ర్యాంక్‌తో సహా కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఐసెట్ అభ్యర్థుల తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ర్యాంక్ కార్డును యాక్సెస్ చేయొచ్చు. ఇందుకోసం.. ఐసెట్ అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

టీఎస్ ఐసెట్ 2024 ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

  • ఐసెట్ అభ్యర్థులు ముందుగా (icet.tsche.ac.in)లో ‘TS ICET’ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడి.
  • హోమ్‌పేజీలో ‘TS ICET 2024 Results’ కోసం సెక్షన్ గుర్తించి అక్కడి లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టిక్కెట్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ వ్యక్తిగత వివరాలను సమర్పించండి.
  • మీ టీఎస్ ఐసెట్ 2024 ఫలితాలను స్క్రీన్‌పై వీక్షించండి.
  • మీ స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • మీ రికార్డ్‌ల కోసం కాపీని ప్రింట్ చేయండి.

Read Also : NEET UG Exam : నలుగురు సభ్యులతో కమిటీ.. ఆ 1500 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కుల్ని సమీక్షిస్తుంది : ఎన్టీఏ డీజీ

ట్రెండింగ్ వార్తలు