Kalki 2898 AD : ‘కల్కి’ సినిమా కథేంటి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే..?

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ఏం చూపించబోతున్నాడు, కల్కి సినిమా ఎందుకు తీసాడు అని చెప్పాడు.

Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) కల్కి 2898AD మూవీ జూన్ 27 విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కల్కి సినిమా నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ఏం చూపించబోతున్నాడు, కల్కి సినిమా ఎందుకు తీసాడు అని చెప్పాడు. అలాగే ఈ వీడియోలో కల్కి మేకింగ్ విజువల్స్ కూడా చూపించారు.

Also Read : Alka Yagnik : బాలీవుడ్ స్టార్ సింగర్.. ఆ వ్యాధితో చెవుడు.. ఇకపై పాడలేదా?

నాగ్ అశ్విన్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ఈ కథ అన్నిటికి క్లైమాక్స్. మన కలియిగంలో ఎలా జరగబోతుంది అనేది. ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా ఈ కథకు కనెక్ట్ అవుతుంది. చిన్నప్పట్నుంచి పౌరాణిక సినిమాలు చాలా ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలాంటి సినిమాలు ఇంకా ఇష్టం. హాలీవుడ్ లో స్టార్ వార్స్ లాంటి సినిమాలు బాగుంటాయి. అలాంటి కథలు మన దగ్గర కూడా ఉన్నాయిగా, ఎప్పుడూ ఆ దేశంలోనే జరగాలా అనిపించేది. మన పురాణాల్లో చివరి అవతారం కృష్ణ. మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కృష్ణుడి తర్వాత కథ ఎలా వెళ్తుంది అనేది ఊహల్లో రాసుకున్నాను. కలియుగం చివర ఎలా జరుగుతుంది అని రాసుకున్నాను. ఈ కథ మనం చదివిన పురాణాలకు క్లైమాక్స్ లాగా రాసుకున్నాను. కల్కి అనేవాడు ప్రతి కాలంలో ఉంటాడు ఒక్కో రూపంలో, కలియుగంలో ఎలాంటి రూపం తీసుకున్నాడు, ఎలా అంతమయ్యాడు అనేది ఆలోచించి రాయడానికి ఐదేళ్లు పట్టింది నాకు. దాన్ని ఇలా సైఫై మైథలాజి సినిమాగా తెరకెక్కించాను అని తెలిపాడు.

అయితే ఎపిసోడ్ 1 అని ఈ చిన్న వీడియో రిలీజ్ చేశారు. త్వరలో మరిన్ని వీడియోలతో మరింత సమాచారం చెప్తూ, మరిన్ని మేకింగ్ విజువల్స్ చూపిస్తారని సమాచారం. గతంలో కూడా కల్కి సినిమా గురించి మహాభారతం గురించి మాట్లాడాడు నాగ్ అశ్విన్. దీంతో కల్కి సినిమా మహాభారత యుద్ధం చివర్లో మొదలయి కలియుగం చివర్లో ముగుస్తుందని తెలుస్తుంది. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు