Alka Yagnik : బాలీవుడ్ స్టార్ సింగర్.. ఆ వ్యాధితో చెవుడు.. ఇకపై పాడలేదా?

తాజాగా సింగర్ అల్కా యాగ్నిక్ తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపింది.

Alka Yagnik : బాలీవుడ్ స్టార్ సింగర్.. ఆ వ్యాధితో చెవుడు.. ఇకపై పాడలేదా?

Bollywood Star Singer Alka Yagnik Effected with Rare Sensory Neural Nerve Hearing Loss

Singer Alka Yagnik : బాలీవుడ్ స్టార్ సింగర్ అల్కా యాగ్నిక్.. 1980, 90 దశకాల్లో ఎన్నో బాలీవుడ్ సినిమాలలో కొన్ని వందల పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది. హిందీతో పాటు తెలుగు, బెంగాలీ, తమిళ్, ఒరియా, ఇంగ్లీష్, మరాఠి.. ఇలా పలు భాషల్లో కూడా పాటలు పాడి అలరించింది. ప్రస్తుతం అడపాదడపా పాటలు పాడుతూ, పలు సింగింగ్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది అల్కా యాగ్నిక్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ స్టార్ సింగర్.

తాజాగా అల్కా యాగ్నిక్ తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపింది. తనొక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. తన సోషల్ మీడియాలో అల్కా యాగ్నిక్ తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read : NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ పక్కా హిట్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్న ఫ్యాన్స్.. 23 ఏళ్ళ తర్వాత..

అల్కా యాగ్నిక్ తన పోస్ట్ లో.. నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ అందరికి ఒక విషయం చెప్పాలి. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగుతుంటే సడెన్ గా నాకేం వినబడలేదు. గత కొన్ని రోజులుగా నాకేం వినిపించట్లేదు. కొన్ని రోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అరుదైన వ్యాధి సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌ తో బాధపడుతున్నాను. ఈ విషయం నాకు డాక్టర్లు చెప్పారు. వైరల్ అటాక్ వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఇది నేను అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను అని తెలిపింది. అలాగే మీ అందరికి ఒకటి చెప్తున్నాను, పెద్ద సౌండ్ తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి అని తెలిపింది అల్కా యాగ్నిక్.

View this post on Instagram

A post shared by Alka Yagnik (@therealalkayagnik)

దీంతో అల్కా యాగ్నిక్ పోస్ట్ వైరల్ అవగా ఆమె అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చెవులు వినిపించకపోవడం వల్ల ఆ సమస్య తగ్గేవరకూ సింగింగ్ కి కూడా దూరమవనుంది అల్కా యాగ్నిక్.