UPSC Civil Services 2024 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

UPSC Civil Services 2024 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

UPSC Civil Services 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in) లేదా (upsconline.nic.in) నుంచి కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : UPSC Aspirants : తప్పుదారి పట్టించే ‘యూపీఎస్సీ స్టడీ ప్రిపరేషన్’ బ్లాగ్స్‌‌కు దూరంగా ఉండండి : ఐఏఎస్ అధికారి సూచన

అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయడానికి గడువు జూన్ 16, 2024. అభ్యర్థులు ఎగ్జామ్ హాల్‌లోకి ప్రవేశించడానికి వారి ఇ-అడ్మిట్ కార్డ్‌తో పాటు (ఒరిజినల్) ఫొటో ఐడెంటిటీ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2024 తుది ఫలితాలు ప్రకటించే వరకు కార్డ్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.

యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ కూడా పరీక్షా వేదికలోకి విద్యార్థుల ప్రవేశం పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు క్లోజ్ అవుతుందని పేర్కొంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2024 పరీక్ష జూన్ 16, 2024న నిర్వహించనున్నారు. పరీక్ష గతంలో మే 26న షెడ్యూల్ అయింది. ఏప్రిల్-జూన్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కారణంగా పరీక్ష టైమ్‌టేబుల్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుంది.

ఈ 2024 ఏడాదిలో కమిషన్ సీఎస్ఈలో మొత్తం 1,056, (IFoS) కోసం 150 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాదిలో 1,105 పోస్ట్‌ల కన్నా తక్కువగా ఉంది. అయితే, 2021లో 712, 2020లో 796 ఖాళీలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు రెండు పేపర్‌లను ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ (మల్టీపుల్ ప్రశ్నలు), సెక్షన్ 2లోని సబ్-సెక్షన్ (A)లో పేర్కొన్న సబ్జెక్టులలో గరిష్టంగా 400 మార్కులు ఉండాలి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నాపత్రాలలో అభ్యర్థులు గుర్తించిన తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

Read Also : UPSC 2023 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు