AP EAPCET : అతి త్వరలో ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

AP EAPCET Results : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలో సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ప్రవేశం పొందుతారు.

AP EAPCET : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నిలాజికల్ యూనివర్శిటీ (JNTU) కాకినాడ త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. ఈ ఈఏపీసెట్ పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత, పరీక్షలో హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ (cets.apsche.ap.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : NEET UG 2024 Result : నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదల.. మీ స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోండి!

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల ప్రకటన తర్వాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాలి. కౌన్సెలింగ్‌ ఆధారంగా వారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలో సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ప్రవేశం పొందుతారు.

  • ఇంజనీరింగ్
  • బయోటెక్నాలజీ
  • డెయిరీ టెక్నాలజీలో బీటెక్
  • వ్యవసాయ ఇంజనీరింగ్
  • ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • వ్యవసాయంలో బీఎస్సీ
  • హార్టికల్చర్
  • వెటర్నరీ సైన్సెస్
  • బిఫార్మసీ
  • ఫార్మా (డి)

ఏపీ ఎంసెట్ (EAMCET) ఇంజనీరింగ్ పరీక్ష 2024 మే 18 నుంచి మే 23 మధ్య నిర్వహించింది. ఎంసెట్ అభ్యర్థులు ఓసీ, బీసీ అభ్యర్థులకు 160కి కనీసం 40 (25శాతం) స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం కనీస అర్హత మార్కులు అవసరం ఉండదు.

Read Also : CBSE Board Results : సీబీఎస్ఈ బోర్డు ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈ నెల 20లోపు ప్రకటించే ఛాన్స్..!

ట్రెండింగ్ వార్తలు