NEET UG 2024 Result : నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదల.. మీ స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోండి!

NEET UG 2024 Result : నీట్ 2024 ఫలితాలతో పాటు, ఎన్టీఏ ఆల్ ఇండియా టాపర్ల పేర్లను కేటగిరీ వారీగా కట్-ఆఫ్ మార్కులు, పర్సంటైల్ ర్యాంకులను విడుదల చేస్తుంది.

NEET UG 2024 Result : నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదల.. మీ స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోండి!

NTA NEET UG 2024 result declared ( Image Credit : Google )

NEET UG 2024 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 4, 2024న నీట్ 2024 ఫలితాలను ప్రకటించింది. నీట్ అభ్యర్థులు ఇప్పుడు అధికారిక ఎన్టీఏ నీట్ వెబ్‌సైట్‌లో (exams.nta.ac)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం తమ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. నీట్ 2024 ఫలితాలతో పాటు, ఎన్టీఏ ఆల్ ఇండియా టాపర్ల పేర్లను కేటగిరీ వారీగా కట్-ఆఫ్ మార్కులు, పర్సంటైల్ ర్యాంకులను విడుదల చేస్తుంది.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఫైనల్ ఆన్సర్ కీ జూన్ 3, 2024న అందుబాటులోకి వచ్చింది. ఇక, ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన కొద్దిసేపటికే ఫలితాలు వెల్లడయ్యాయి. నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ మే 29న జారీ అయింది. ఆ తర్వాత నీట్ అభ్యర్థుల నుంచి అభ్యంతరాల విండో జూన్ 1, 2024న క్లోజ్ అయింది.

నీట్ ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి :
ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న (NEET 2024) స్కోర్‌కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, Submit బటన్‌పై క్లిక్ చేయండి.
మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
స్కోర్‌కార్డ్‌ని చెక్ చేసి.. పేజీని డౌన్‌లోడ్ చేయండి.

ఎన్టీఏ భారత్ వెలుపల ఉన్న 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాలలో 24 లక్షల మంది అభ్యర్థులకు నీట్ యూజీ 2024 పరీక్షను నిర్వహించింది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?