NEET UG Exam : నలుగురు సభ్యులతో కమిటీ.. ఆ 1500 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కుల్ని సమీక్షిస్తుంది : ఎన్టీఏ డీజీ

NEET UG Exam : 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని ఎన్టీఏ డీజీ పేర్కొన్నారు.

NEET UG Exam : నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర విద్యాశాఖ ఏర్పాటుచేసింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతామని ఎన్టీఏ డీజీ తెలిపారు. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఎన్టీఏ నిర్ణయించింది.

వారం రోజుల్లో సిఫారసులతో కమిటీ నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని ఎన్టీఏ డీజీ పేర్కొన్నారు.

గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సుబోధ్ కుమార్ సింగ్ అన్నారు. నీట్ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియపైనా ఏ ప్రభావం చూపదని ఎన్టీఏ డీజీ స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్టీఏ తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీటి పరీక్ష పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదని ఎన్టీఏ డీజీ తెలిపారు.

ఎన్‌సీఈఆర్టీ (NCERT) పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే కొందరు విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలుగా సుబోధ్ కుమార్ సింగ్ వెల్లడించారు. నీట్ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనే అంశంపై కమిటీ సిఫారసులను బట్టి ముందుకు వెళ్తామని ఎన్టీఏ డీజీ పేర్కొన్నారు.

Read Also : UPSC Civil Services 2024 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

ట్రెండింగ్ వార్తలు