NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ పక్కా హిట్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్న ఫ్యాన్స్.. 23 ఏళ్ళ తర్వాత..

దేవర కంటెంట్ పై ఎంత నమ్మకమున్నా ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడో చిన్న భయం ఉంది.

NTR Devara : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ఇప్పటిదాకా తెరపై కనపడలేదు. ఎన్టీఆర్ తెరపై కనపడి రెండేళ్లు దాటేసింది. దీంతో అభిమానులు దేవర సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమాని రెండు పార్టులుగా తీస్తున్నారు. దేవర పార్ట్ 1 మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

దేవర సినిమా ఏప్రిల్ లో రావాల్సి ఉండగా దసరాకు వాయిదా వేశారు. పవన్ OG సినిమా వాయిదాపడటంతో ఒక రెండు వారాలు ముందుకు వచ్చి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అభిమానులు దేవర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి కచ్చితంగా ఫ్లాప్ పడుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటివరకు ఏ హీరో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయారు. ఇటీవల చరణ్ కూడా RRR తర్వాత ఆచార్యతో ఫ్లాప్ చూసాడు.

Also Read : Vijay – Pawan Kalyan : పవన్ లాగే విజయ్ కూడా సంచలన నిర్ణయం.. అప్పటివరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయనంటూ..

దీంతో దేవర కంటెంట్ పై ఎంత నమ్మకమున్నా ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడో చిన్న భయం ఉంది. అయితే తాజాగా ఓ కొత్త సెంటిమెంట్ ని పట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. గతంలో ఎన్టీఆర్ సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు సెప్టెంబర్ లోనే రిలీజ్ అయి హిట్ అయ్యాయి. దీంతో దేవర కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయి హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. దీంతో 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే డేట్ కి దేవర సినిమా తెస్తుండటంతో దేవర కచ్చితంగా హిట్ అవుతుంది అని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ మాస్ తో మెప్పిస్తాడో.

ట్రెండింగ్ వార్తలు