TGPSC Group-1 Mains : గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల..

రాష్ట్రంలో 563 గ్రూప్ -1 ఉద్యోగాల‌ భ‌ర్తీకి సంబంధించిన మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) విడుద‌ల చేసింది.

TGPSC Group-1 Mains Schedule : రాష్ట్రంలో 563 గ్రూప్ -1 ఉద్యోగాల‌ భ‌ర్తీకి సంబంధించిన మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 21 నుంచి 27 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ బాష‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. డిస్క్రిప్టివ్ విధానంలో ఈ ప‌రీక్ష ఉంటుంద‌ని తెలిపింది. అభ్య‌ర్థులు తాము ఎంచుకున్న భాష‌లోనే పరీక్ష రాయొచ్చు. ప్ర‌తీ పేప‌ర్ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

కాగా.. ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించారు. ఈ ప‌రీక్ష‌కు 4.03 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు..

మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

అక్టోబ‌ర్ 21 – జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ (క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
అక్టోబ‌ర్ 22 – పేప‌ర్ 1 (జ‌న‌ర‌ల్ ఎస్సే)
అక్టోబ‌ర్ 23 – పేప‌ర్ 2 (హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ)
అక్టోబ‌ర్ 24 – పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌)
అక్టోబ‌ర్ 25 – పేప‌ర్ 4 (ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)
అక్టోబ‌ర్ 26 – పేప‌ర్ 5 (సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)
అక్టోబ‌ర్ 27 – పేప‌ర్ 6 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)

ట్రెండింగ్ వార్తలు