గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నుంచి మేము వెళ్లగొట్టలేదు: ఎంపీ అర్వింద్

"గతంలో ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి రాజాసింగ్ సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్ మళ్లీ ఎత్తేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు" అని చెప్పారు. (Arvind Dharmapuri)

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నుంచి మేము వెళ్లగొట్టలేదు: ఎంపీ అర్వింద్

BJP MP Arvind

Updated On : September 7, 2025 / 8:32 PM IST

Arvind Dharmapuri: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నుంచి తాము వెళ్లగొట్టలేదని ఆయనే రాజీనామా చేసి వెళ్లారని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఇవాళ “10టీవీ వీకెండ్‌ విత్ అర్వింద్” ప్రోగ్రాంలో అర్వింద్ మాట్లాడారు.

“గతంలో ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి రాజాసింగ్ సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్ మళ్లీ ఎత్తేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు” అని చెప్పారు. (Arvind Dharmapuri)

Also Read: మూడో భార్య చేతిలో భర్త హత్య.. బావిలో మృతదేహం.. రెండో భార్య గుర్తించి..

గత తెలంగాణ ఎన్నికల ముందు బీసీ సీఎం అని బీజేపీ డిక్లేర్ చేయడం పట్ల అర్వింద్ మాట్లాడారు. “బీసీ సీఎం అని పార్టీ డిక్లేర్ చేసింది. బీసీ సీఎం ఎందుకు డిక్లేర్ చేశరో మీకు తెలుసు. హై కమాండ్ కి తెలుసు.

బీసీ సీఎం అని డిక్లేర్ చేసినప్పుడు కిషన్ రెడ్డి నిలబడరు. డీకే అరుణ నిలబడరు. జితేందర్ రెడ్డి నిలబడరు. విశ్వేశ్వర్ రెడ్డి నిలబడరు. సీనియర్ రెడ్డి నాయకులలో ఎవరూ నిలబడకపోతే బీసీ సీఎంకి విలువ ఎట్లా ఉంటది అని అడిగాను.

డిసిషన్ మీది అంటే పార్టీది. మేమందరం క్యారీ చేశాం. మా ప్రధానమంత్రి బీసీ.. మా ప్రధానమంత్రి చెప్పుకోరు. ఆయన ప్రధాని అయ్యింది బీసీ కాబట్టి కాదు. ప్రధానమంత్రి ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకు ఉన్న టాలెంట్ ఆయనకు ఉన్న క్రమశిక్షణ, ఎఫిషియన్సీ, కమిట్మెంట్, హార్డ్ వర్క్ అలా ఉన్నాయి.

మనం ఒక పార్టీగా ప్రజల ముందు చెప్పినప్పుడు మరి ఎవరూ ఆ మాటకు నిలబడకపోతే ఎలా? నిజామాబాద్‌ ప్రజలు నాకు దేవుళ్లు. మనం ప్రజల ముందర ఒక మెసేజ్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు వ్యవహారం కూడా ఉండాలి” అని అన్నారు.

పూర్తి పాడ్‌కాస్ట్‌