Adipurush: టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి ఏదో ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఇక స్టార్ కాస్టింగ్‌కి సంబంధించి పలువురు నటీనటుల పేర్లు కూడా వినబడుతున్నాయి.
సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన టీం.. ‘ఆదిపురుష్’ సెట్ డ్యామేజ్ అయ్యాక అప్డేట్స్ విషయంలో కాస్త ఆలస్యం చేస్తోంది. అసలే ‘రాధే శ్యామ్’ డిలే మీద డిలే కావడం, ‘సలార్’ షూటింగ్‌కి బ్రేక్ పడడంతో మేకర్స్ మీద పిచ్చ కోపంతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్, రాముడిగా ప్రభాస్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ అంటూ వరుస అప్డేట్స్తో అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టీం, ఇప్పుడు చప్పుడు చెయ్యకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రెడీ చేసేశారు. ‘మీరేంటి ఫస్ట్ లుక్ వదిలేది.. మేమే క్రియేట్ చేసి రిలీజ్ చేస్తాం’ అంటూ రామావతారంలో విల్లు విరుస్తున్న ప్రభాస్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్..