Kcr : ఈసారి అందరూ ఆలోచించి ఓటు వేయాలి- సిరిసిల్లలో కేసీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నారు. జిల్లా పోవద్దు అంటే వినోద్ ను గెలిపించాలి..

Kcr : కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. చేనేత మీద మొదటిసారి చేనేత జీఎస్టీ వేసింది ప్రధాని మోడీ అని చెప్పారు. మోడీ హయాంలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. అంతా డబ్బాలో రాళ్ళు వేసి ఊపుడే అని విమర్శించారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి ఆశల పల్లకిలో పెట్టిందని మండిపడ్డారు. ఈసారి అందరూ ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు.

”అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. మోదీ గోదావరి నది తీసుకుని వెళ్తే, తెలంగాణకు ఉన్న ఒక్క ఆధారం పోతే ఎలా? నేతన్నలకు ఏదో ఒక పని ఇచ్చి ఆదుకున్నాం. కళ్ళాల్లో వడ్లు తడిసిపోతుంటే అడిగే దిక్కే లేదు. బండి సంజయ్ మాట్లాడితే ఏం భాషనో కూడా అర్థం కాదు. వినోద్ ను గెలిపించి కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నారు. జిల్లా పోవద్దు అంటే వినోద్ ను గెలిపించాలి” అని కేసీఆర్ అన్నారు.

Also Read : బీఆర్ఎస్ ఓడితే ఏం జరగనుంది?- మాజీమంత్రి హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

ట్రెండింగ్ వార్తలు