UPSC 2023 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

UPSC 2023 : ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (upsc.gov.in)ను విజిట్ చేయొచ్చు.

UPSC 2023 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారిక వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (upsc.gov.in)ను విజిట్ చేయొచ్చు. ఈ సైటు నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష మే 28, 2023న నిర్వహించారు. జీఎస్ 1 పరీక్ష ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, (CSAT) మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగింది.

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష ఉదయం 9:00 నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 గంటల వరకు జరిగింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఆన్సర్ కీలో, కమిషన్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 1 సిరీస్ నుంచి ఒక ప్రశ్నను వదిలివేసింది. మొత్తం 100 ప్రశ్నలు మొత్తం 200 మార్కులు ఉన్నాయి. జనరల్ స్టడీస్ 2 పేపర్ 2లో గరిష్టంగా 200 మార్కులతో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.

యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలను చెక్ చేయండిలా :

  • యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి
  • హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న లింక్ ట్యాబ్‌ను ఎంచుకోండి
  • సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2023 ఆన్సర్ కీ పీడీఎఫ్‌పై క్లిక్ చేయండి
  • స్క్రీన్‌పై ఒక పీడీఎఫ్ డిస్‌ప్లే అవుతుంది.
  • వెంటనే పీడీఎఫ్ (PDF) డౌన్‌లోడ్ చేయండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

Read Also : UPSC Topper Aditya Srivastava : ‘కష్టపడితే.. ఒకరోజు కలలు నిజమవుతాయి’.. యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ రియాక్షన్..!

ట్రెండింగ్ వార్తలు