Gujarat Court: ఆవుల్ని వధించడం ఆపేస్తే, భూమ్మీదున్న సమస్యలన్నీ తీరిపోతాయట.. గుజరాత్ కోర్టు వింత వ్యాఖ్యలు

"ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంది’’ అని అన్నారు. ఇక కొన్ని శ్లోకాలను ఆయన ప్రస్తావిస్తూ "ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్తి మనకే దక్కుతాయి. లేదంటే అవి అదృశ్యమవుతాయి" అని అన్నారు. వాతావరణ మార్పులకు గోవధకు కూడా ఆ జడ్జి ముడిపెట్టారు

Gujarat Court: ఆవుల్ని వధించడం ఆపేస్తే, ఈ భూమి మీద ఉన్న సమస్యల్నీ తీరిపోతాయని గుజరాత్ రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది. పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించే సందర్భంలో తాపీ జిల్లా ధర్మాసనం జడ్జి జస్టిస్ సమీర్ వనోద్ చంద్ర వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ఇంతటితోనే ఆగకుండా గోపేడ, గోమూత్రం మహత్యం గురించి సైతం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడతో అలికిన ఇంట్లో సూర్యుని నుంచి వెలువడే అణు కిరణాల ప్రభావం ఉండదని, అలాగే ఆవు మూత్రంతో అనేక వ్యాధుల్ని నివారించవచ్చని అన్నారు.

Shahrukh and Sharma: ప్రభుత్వాన్ని నడపడానికి సంఘీలు ఇక కాంగ్రెస్ వైపు చూడాలి.. షారూఖ్, శర్మ కాంట్రవర్సీపై కాంగ్రెస్

జడ్జి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. నెటిజెన్లు ఆయన వ్యాఖ్యలను ఊటంకిస్తూ ఛలోక్తులు విసురుతున్నారు. కొందరేమో న్యాయవ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చాలా కాలంగా వినిపిస్తున్నవే అయినప్పటికీ, వీటికి శాస్త్రీయ ఆధారాలు అయితే ఇప్పటికీ లేవు. గోరక్షణకు సంబంధించి నవంబర్‌లో కొన్ని ఉత్తర్వులు జారీ చేయాలంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అవి ఇప్పటికే ఆచరణలోకి రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Pakistan: డ్రగ్స్ తీసుకోనందుకు తోటి విద్యార్థిని ముఖం పగలకొట్టిన మరో విద్యార్థిని

ఈ విషయమై ఇంకా ఆయన మాట్లాడుతూ “ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంది’’ అని అన్నారు. ఇక కొన్ని శ్లోకాలను ఆయన ప్రస్తావిస్తూ “ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్తి మనకే దక్కుతాయి. లేదంటే అవి అదృశ్యమవుతాయి” అని అన్నారు. వాతావరణ మార్పులకు గోవధకు కూడా ఆ జడ్జి ముడిపెట్టారు. ఆవేశం, కోపం వంటివి పెరగడం గోవధ వల్లనే అని అన్నారు. గోవధను పూర్తిగా నిషేధించే వరకు ఇలాంటి వాతావరణం కొనసాగుతుందని, ఇంకా పెరుగుతుందని అన్నారు. గత ఏడాది ఆగస్టులో 16 ఆవులను అక్రమంగా రవాణా చేయడంపై ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, సదరు వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు, ఆ వ్యక్తికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు.

ట్రెండింగ్ వార్తలు