IPL 2022: నేరుగా మహిళ తలమీదకు సిక్సు బాదేసిన ఆయుష్ బదోనీ

లక్నో సూపర్ జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)మ్యాచ్ లో ఓ ప్రమాదకరమైన షాట్ బాదాడు లక్నో జట్టు ప్లేయర్.

IPL 2022: టీ20 క్రికెట్ అంటేనే సిక్సులు, ఫోర్ల పండగ. అటాకింగ్ మోడ్ లో జరిగే ఆటతీరు చూసేవాళ్లలో కూడా పూనకాలు తెప్పిస్తుంది. కొద్ది రోజుల క్రిందట మొదలైన ఐపీఎల్ 2022లోనూ సిక్సుల మోత మోగిపోతుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)మ్యాచ్ లో ఓ ప్రమాదకరమైన షాట్ బాదాడు లక్నో జట్టు ప్లేయర్.

లక్నో సూపర్ జెయింట్స్ కు చెందిన యువ క్రికెటర్ బాదిన సిక్సుకు నేరుగా బంతి వెళ్లి మహిళ తలపై పడింది. పసుపు రంగు టీ షర్ట్ లో కూర్చొన్న మహిళ.. ఆ సిక్సుకు కాసేపటి వరకూ మాట్లాడలేకపోయింది. ప్రస్తుత సీజన్లో లక్నో జట్టుకు అగ్రెసివ్ ప్లేయర్ గా మారిపోయాడు ఆయుష్. నిజానికి ఆ బాల్ ను మహిళ క్యాచ్ పట్టుకుందామని యత్నించి ఫెయిల్ అయిందట.

రీప్లేలో బాల్ పట్టుకుందామని చేతులతో ప్రయత్నించగా.. అది మిస్ అయి నేరుగా తల మీద పడ్డట్లు క్లియర్ గా కనిపించింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఘటన తర్వాత కొన్ని క్షణాల పాటు ఆమె తల రుద్దుకుంటూనే ఉన్నారు. స్టేడియం స్టాఫ్ ఒకరు ఆమె వద్దకు వెళ్లి సమస్యగా అనిపిస్తుందా అని వాకబు చేసి సేఫ్ అని తెలిసి కుదుటపడ్డారు.

Read Also: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”

లక్నో విజయంలో బదోనీ కీలక పాత్ర పోషించాడు. 9బంతుల్లోనే 19పరుగులు సాధించి ఎవిన్ లూయీస్ తో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు.

ట్రెండింగ్ వార్తలు