Bangladesh vs India: రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే బంగ్లా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్

భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 314 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 314 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో నజ్ముల్ 5, జకీర్ హసన్ 51, మోమినల్ హక్ 5, షకీబ్ అల్ హసన్ 13, ముష్ఫికర్ రహీం 9, లిట్టోన్ దాస్ 73, మెహిదీ హసన్ 0, నురుల్ హసన్ 31, తస్కిన్ అహ్మద్ 31, తైజుల్ ఇస్లాం 1, ఖలెద్ అహ్మద్ 4 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్, జయదేవ్ చెరో వికెట్ తీశారు.

రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వచ్చారు. అయితే, కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఆరు బంతులు ఆడి కేవలం రెండు పరుగులే చేసి, షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో నురూల్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో మూడో రోజే బంగ్లాదేశ్ ఆలౌట్ కావడం, మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో టీమిండియా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’

ట్రెండింగ్ వార్తలు