Bimbisara: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న సినిమా బింబిసార. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనేది ట్యాగ్. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. హీరోగా కల్యాణ్ రామ్ 18వ సినిమా ఇది. ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ఉగాది పర్వదినం సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీ ప్రకటించారు.
Bimbisara: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన కీరవాణి?
బింబిసార సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సూట్ వేసుకున్న కళ్యాణ్ రామ్ స్టయిలిష్ లుక్ పోస్టర్ విడుదల చేసిన టీమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అటెన్షన్ క్రియేట్ చేశారు. అప్పుడు బింబిసారగా శత్రువులను చంపి శవాలపై ఠీవిగా కూర్చున్న ఫస్ట్ లుక్ వైవిధ్యంగా వదిలిన బింబిసార మేకర్స్.. ఇప్పుడు ఈ తరం యువకుడిగా కళ్యాణ్ రూమ్ మరో కొత్త లుక్ ను పరిచయం చేశారు.
Bimbisara : అసలు ఎవరీ ‘బింబిసార’? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్..
రాజుగా, ఈ తరం యువకుడిగా… సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెండు లుక్స్ వదిలిన మేకర్స్ సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ చూపించేశారు. కళ్యాణ్ రామ్ సరసన నాయికలుగా కేథరిన్.. సంయుక్త మీనన్ కనిపించనున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఆశలు తీరి.. కళ్యాణ్ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా చూడాలి.
The date is locked for BIMBISARA to ascend the throne ?#Bimbisara grand release on 5th August ?#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe
— NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022