Jithender Reddy : దున్నపోతు ట్రీట్‌మెంట్ అంటూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ .. బీజేపీలో పెను దుమారం

మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

BJP Leader Jithender Reddy

BJP Leader Jithender Reddy : తెలంగాణ (Telangana) బీజేపీ సీనియర్ నేత చేసిన ట్వీట్ వివాదంగా మారింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి (BJP Leader Jithender Reddy) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కించే వీడియోను పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి ‘తెలంగాణ బీజేపీ ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బీజేపీలో కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేసిన జితేందర్ రెడ్డి ట్విట్ ను తిరిగి మళ్ళీ పోస్టు చేశారు.

కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటి అంటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కల్లారా అంటూ వివరణ ఇచ్చారు. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి అంటూ పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటూ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ బీజేపీ నేతలను ఉద్ధేశించినట్లుగా ఉండటంతో ఆయన మరో ట్వీట్ చేస్తు ‘‘కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటి అంటే’’అంటూ వివరణ ఇచ్చినట్లుగా ఉంది. మొదటి ఆయన చేసిన ట్వీట్ తో తెలంగాణ బీజేపీలో విభేధాలు ఉన్నాయని తేలిపోయిందంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు. ఈ ట్వీట్ వివాదాస్పదం అవుతుందని తెలిసే ట్వీట్ చేసి మళ్లీ డిలీట్ చేశారని అంటున్నారు.

కాగా బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న జితేందర్ రెడ్డి..ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. తెలంగాణలో బీజేపీ పెద్దగా గుర్తింపు లేనప్పటినుంచీ కూడా ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. అటువంటి సీనియర్ నేత ఇలాంటి ట్వీట్ చేయటం కలకలం రేపుతోంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ బీజేపీలో. బీజేపీలో ఇటీవల అంతర్గతంగానే కుమ్ములాటలు, ఆధిపత్య పోరు జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు ఎవరికివారు తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న క్రమంలో సీనియర నేత అయి ఉండి జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ బీజేపీలో దుమారం రేపుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు