ICICI Loan Case: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

బాంబే హైకోర్టు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌‌లకు ఊరట కల్పించింది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 41ఏ ప్రకారం.. అరెస్టు చేయలేరని జ‌స్టిస్ రేవ‌తి మోహితే దేరే, జ‌స్టిస్ పీకే చావ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజా తీర్పును ఇచ్చింది. వారిని వెంటనే జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలచేయాలని కోర్టు ఆదేశించింది.

ICICI Loan Case: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌‌లకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మోసం కేసులో వారి అరెస్టు చట్టవిరుద్దంఅని హైకోర్టు పేర్కొంది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భర్తను రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

సీబీఐ గత ఏడాది డిసెంబర్ 23న చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌లను అరెస్టు చేసింది. ఈ అరెస్టును ఖండిస్తూ తక్షణమే తమను విడుదల చేయాలని, తమపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలనిక కోరుతూ దంపతులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై సోమవారం బాంబే హైకోర్టు విచారించింది. ఈ విచారణలో భాగంగా కోర్టు కొచ్చర్ దంపతులకు ఊరట కల్పించింది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 41ఏ ప్రకారం.. అరెస్టు చేయలేరని న్యాయమూర్తులు రేవతి మోహితేరే, పీకే చవాన్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రూ. లక్ష బెయిల్ బాండ్‌పై ఇద్దరిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

వీడియోకాన్ కేసు :చందాకొచ్చర్ నివాసంలో ఈడీ సోదాలు

తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్‌కు 3,250 కోట్ల రుణం ఇచ్చింది. ఇందులో చందా భర్త దీపక్ కొచ్చర్‌కు 50శాతం వాటా ఉంది. రుణం ఇచ్చిన తరువాత అది ఎన్‌పీఏగా మారింది. ఆ తరువాత బ్యాంకు మోసంగా ప్రకటించబడింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసు వ్యవహారంలో భాగంగా డిసెంబర్ 24న సీబీఐ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌‌లను విచారణకు పిలిచింది. దంపతులుపై ఆరోపణలు చేస్తూ ఇద్దరూ తమ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పడం లేదని, దర్యాప్తు కు సహకరించడం లేదని ఆరోపిస్తూ సీబీఐ వారిద్దరిని అదుపులోకి తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు