AP Cinema Ticket Price Issue : జగన్ చాలా పెద్ద మాట అన్నారు : చిరంజీవి

చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గారితో జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా సాగింది. పండగ పూట సోదరుడిగా పిలిచి విందు భోజనం పెట్టారు. ఆప్యాయతని చూపెట్టారు. వారితో కలిసి లంచ్ చేశాను...

Chiranjeevi :  ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై రోజు రోజుకి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సినీ పరిశ్రమ ప్రముఖులంతా ఈ విషయంపై మాట్లాడారు. ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఈ సమస్యకి పరిష్కారం తెస్తారని అంతా భావించారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి జగన్ ని కలిశారు. జగన్ ఫోన్ చేసి చిరంజీవిని రమ్మనడంతో ఇవాళ చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లి లంచ్ చేస్తూ సినిమా సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గారితో జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా సాగింది. పండగ పూట సోదరుడిగా పిలిచి విందు భోజనం పెట్టారు. ఆప్యాయతని చూపెట్టారు. వారితో కలిసి లంచ్ చేశాను. భారతి గారు ఎంతో ప్రేమగా వడ్డించారు. ఆ తర్వాత సినిమా సమస్యలపై చర్చించాను. కొన్ని నెలలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. చాలా మందికి ప్రభుత్వం తీసుకున్న గత నిర్ణయాల పై అసంతృప్తి ఉంది. ఎవరెవరో ఏదేదో మాట్లాడటం వల్ల సమస్య రోజు రోజుకి జఠిలమవుతుంది. అందుకే నన్ను జగన్ పిలిచారు. మీరు వచ్చి మీ సమస్యని చెప్పండి అని అన్నారు. మీరు చెప్పింది కూడా విని మీ సమస్యలని పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటాను అన్నారు.” అని తెలిపారు.

Chay-sam : మేమిద్దరం విడిపోయి హ్యాపీగానే ఉన్నాం.. విడాకులపై స్పందించిన చైతూ

అందుకే కలవడానికి వచ్చానని చెప్పి ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన విషయాలని మీడియాకి తెలియచేస్తూ.. ”సామాన్య ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యని వివరించాను. ఆ సమస్యలకి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ ఓ నివేదికని తయారు చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ బయటకి కనిపించినంత కలర్ ఫుల్ గా ఉండదు. ఎంతో మంది వెనకాల కార్మికులు కష్టపడతారు. కరోనా టైంలో సినీ కార్మికులు చాలా కష్టాలు పడ్డారు. కరోనా టైంలో వాళ్ళ కోసం ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేశాం. సినీ పరిశ్రమలో కార్మికులు చాలా మంది ఉన్నారు. థియేటర్స్ కూడా మూసెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ సమస్యల్ని కూడా మాట్లాడాను. జగన్ గారు సానుకూలంగా స్పందించారు. మీరు వచ్చి చెప్పారు. నేను అందర్నీ సమ దృష్టితో చూస్తాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. నాకు ధైర్యం వచ్చింది. త్వరలో ఫైనల్ కమిటీ నివేదిక చేసి ఇండస్ట్రీని పిలిచి మాట్లాడాకే ఫైనల్ చేస్తాను అని మంచి మాట చెప్పారు”.

Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

”నేను ఇండస్ట్రీ పెద్దగా రాలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. ఇండస్ట్రీ బిడ్డగా అందరికి ఒకటే చెప్తున్నాను ఎవరూ తొందరపడి అభద్రతా భావంతో మాటలు జారొద్దు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, స్టేట్మెంట్స్ ఇవ్వకండి. జగన్ గారు మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నెల లోపు చెప్తారు. చిన్న సినిమాలు అయిదవ షో ఉండాలని అడిగారు. అది కూడా అడిగాను. నేను ఇచ్చిన సూచనల్ని అన్నిటిని తీసుకున్నారు. ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు నాకు చెప్పినవన్నీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం పెట్టి అందరికి చెప్తాను. వాళ్ళు చెప్పినవి కూడా అన్ని విని మళ్ళీ జగన్ ని కలుస్తాను. ఈ సారి ఒక్కన్నే రమ్మంటే ఒక్కన్నే వస్తా. 100 మందితో రమ్మంటే 100 మందితో వస్తాను. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది” అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు